రోడ్డు నిర్మించిన (Road Constructed) రెండ్రోజులకే అది వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో ప్రభుత్వానికి ఏకంగా దాదాపు రూ.4 కోట్ల నష్టం వాటిల్లింది. రహదారి ప్రారంభించిన రెండోరోజే ఈ సంఘటన జరగడంతో ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా (Kurnool District) ప్యాపిలి మండలం చిన్నపూదిళ్ల (Chinnapoodilla) నుంచి డోన్ (Dhone) మండలం గుండాలకు వెళ్లే రహదారి (Road)ని ఘనంగా ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (Kottla Suryaprakash Reddy) ప్రారంభించిన రోడ్డు రెండోరోజే చిన్నపాటి వర్షానికి కొట్టుకుపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రోడ్డు నిర్మాణంలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అధికారులు, కాంట్రాక్టర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో భాగంగా ఎమ్మెల్యే ఫొటో, పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకం మాత్రం చెక్కుచెదరకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రచారంలో ఉన్న శ్రద్ధ.. ప్రజా రహదారి నిర్మాణంలో లేదా అని సెటైర్లు పేలుస్తున్నారు. రూ.4 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ రోడ్డు నాణ్యత లేని నిర్మాణం వల్ల కూలిపోయిందని, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో విమర్శలు, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. “రోడ్డు కొట్టుకుపోయింది కానీ, శిలాఫలకం (Foundation Stone) ఎందుకంత స్ట్రాంగ్ (Strong)గా ఉంది?” అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత “రోడ్లన్నీ బాగు చేశామని” ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, నామమాత్రంగా నాణ్యత లేని రోడ్లు వేసి చేతులు దులుపుకుంటోందనేందుకు ఇదొక నిదర్శమంటున్నారు ప్రజలు. ఎన్నికల సమయంలో వైసీపీ పాలనలో రోడ్లు సరిగా లేవని గట్టిగా ప్రచారం చేసిన కూటమి, ఏడాది గడిచినా గ్రామీణ రహదారుల స్థితిని మెరుగుపరచలేకపోయిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం (Deputy CM పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలని, నాణ్యతతో కూడిన నిర్మాణాలు జరిగేలా చూడాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
నాణ్యత లేకుండా రోడ్డు నిర్మాణం..
— Telugu Feed (@Telugufeedsite) June 16, 2025
ప్రారంభించిన మరుసటి రోజే కొట్టుకుపోయిన రహదారి.. ప్యాపిలిలో రూ.3.8 కోట్లు రోడ్డుపాలు
ప్యాపిలి మండలం చిన్నపూదిళ్ల- డోన్ మండలం గుండాల రహదారి చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోయింది
రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపం.. ప్రభుత్వంపై విమర్శలు… pic.twitter.com/heZiSetQFO









ఐశ్వర్యపై ట్రోల్స్‌కు కంగనా స్ట్రాంగ్ కౌంటర్..