అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని జైన్ ఫార్మా సిటీ (Jain Pharma City)లో ఉన్న ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలో (SS Pharmaceuticals Industry) దుర్ఘటన కార్మికుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఫార్మా కంపెనీలో గురువారం ఉదయం విష వాయు లీక్ (Toxic Gas Leak) ఘటనలో ఇద్దరు కార్మికులు (Two Workers) మృతి(Died) చెందగా, మరొకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఫార్మా కంపెనీ విష వాయువు బారినపడి బాధితులను వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించినప్పటికీ, ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు తెలంగాణకు (Telangana) చెందిన సేఫ్టీ మేనేజర్ (Safety Manager) పరిమి చంద్రశేఖర్ (Parimi Chandrasekhar), అనకాపల్లికి (Anakapalli) చెందిన సేఫ్టీ ఆఫీసర్ (Safety Officer) కుమార్ (Kumar)గా గుర్తించారు. ఒడిశా (Odisha)కు చెందిన సహాయక కార్మికుడు (Assistant Worker) బైదా బైసల్ (Baida Baisal) ప్రస్తుతం విషమ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను విశాఖపట్నం (Visakhapatnam)లోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)(KGH)కు పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటన ఫార్మా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదానికి కారణం సరైన భద్రతా చర్యలు పాటించకపోవడమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనకాపల్లి జిల్లాలోని ఫార్మా సిటీలో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ.. కంపెనీల యాజమాన్యాలు సేఫ్లీ ప్రికాషన్స్ పాటించకపోవడం దారుణమని కార్మికుల కుటుంబాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరగడం, సురక్షిత ప్రమాణాల పట్ల నిర్లక్ష్యం కారణంగా ఉందని విమర్శకులు పేర్కొంటున్నారు. 2024 ఆగస్టులో అచ్చుతాపురం ఎస్‌ఈజెడ్‌లో ఎసియెంటియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో 17 మంది కార్మికులు మృతి చెందిన సంఘటన ఇంకా జనంలో మరచిపోలేదు. ఈ ప్రమాదంపై అనకాపల్లి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు.








