ఫేక్ పోలీస్ స్టేషన్‌.. ఏడాదిపాటు వ‌సూళ్లు!

ఫేక్ పోలీస్ స్టేషన్‌తో ఏడాదిపాటు మోసాలు!

బీహార్‌ (Bihar)లోని పూర్ణియా (Purnia) జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. మోహని గ్రామంలో (Mohani Village) రాహుల్ కుమార్ షా (Rahul Kumar Shah) అనే వ్యక్తి ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్‌ను (Fake Police Station) ఏర్పాటు చేసి, ఏడాది పాటు యథేచ్ఛగా అక్రమ దందాలు (Illegal Activities) నిర్వహించాడు.

గ్రామీణ రక్షాదళ్ రిక్రూట్‌మెంట్ (Rural Home Guard Recruitment) పేరుతో కానిస్టేబుల్ (Constable), చౌకీదార్ల (Guards’) అక్రమ నియామకాలు చేపట్టిన రాహుల్, స్థానిక యువత నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసి లక్షలాది రూపాయలు కాజేశాడు. వారికి పోలీసు యూనిఫాంలు (Police Uniforms), లాఠీలు, నకిలీ ఐడీ కార్డులు (Fake ID cards) అందజేసి, పెట్రోలింగ్ (Patrolling), అక్రమ మద్యం (Illegal Liquor) రవాణాపై (Transportation) దాడులు వంటివి చేయించాడు. వసూలు చేసిన డబ్బులో సగం తన వద్ద ఉంచుకొని, మిగతా సగాన్ని తన కింద పనిచేసేవారికి జీతాలుగా ఇచ్చేవాడు. అంతేకాకుండా, అక్రమ రవాణాదారుల నుంచి పట్టుకున్న మద్యాన్ని లంచాలు తీసుకొని తిరిగి వారికే అప్పగించేలా పథకం రచించాడు.

దాదాపు సంవత్సరం పాటు ఈ నకిలీ పోలీసుల ఆగడాలు కొనసాగాయి. అయితే, ఎట్టకేలకు ఈ గుట్టు బయటపడటంతో నిందితుడు రాహుల్ కుమార్ షా పరారయ్యాడు. అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment