భారతదేశంలో (India) కరోనా మహమ్మారి (Corona Pandemic) మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల (Active Corona Cases) సంఖ్య 3,395కి చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 685 కేసులు నమోదయ్యాయి, అలాగే ఒక్క రోజులోనే 8 మంది కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 26 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రాల వారీగా మరణాలు, కేసులు
మహారాష్ట్ర: 7 మరణాలు, 467 యాక్టివ్ కేసులు
కేరళ: 6 మరణాలు, 1,336 యాక్టివ్ కేసులు
ఢిల్లీ: 3 మరణాలు, 375 యాక్టివ్ కేసులు
కర్నాటక: 3 మరణాలు, 234 యాక్టివ్ కేసులు
ఉత్తరప్రదేశ్ (యూపీ): 2 మరణాలు, 117 యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ (ఏపీ): 17 యాక్టివ్ కేసులు
తెలంగాణ: 3 యాక్టివ్ కేసులు
కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Ministry of Health) డేటా ప్రకారం, కేరళ (Kerala)లో అత్యధిక (Highest) యాక్టివ్ కేసులు (Active Cases) నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి నేపథ్యంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ (Dr. Rajeev Bahl), కరోనా కొత్త వేరియంట్‌ల గురించి భయపడాల్సిన అవసరం లేదని, అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
ప్రస్తుత వేరియంట్లు
ప్రస్తుత కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ ఉప-వేరియంట్లు (LF.7, XFG, JN.1, NB.1.8.1) కారణమని ICMR తెలిపింది. అయితే, ఈ వేరియంట్లు తీవ్రమైనవి కావని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు డాక్టర్ బహల్ వెల్లడించారు.
ప్రజలకు సూచనలు
రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరిగా మాస్క్ (Masks) ధరించాలని, సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని నిపుణులు వివరించారు. అదేవిధంగా
పరిశుభ్రత పాటించాలని, తరచూ చేతులు కడుక్కోవడం మరియు శానిటైజర్ (Sanitizer) వాడాలని సూచిస్తున్నారు.







