‘స్థానిక’ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో జ‌గ‌న్ కీల‌క‌ సమావేశం

స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌తో జ‌గ‌న్ కీల‌క‌ సమావేశం

Summarize with AI

వైసీపీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం ప్రారంభ‌మైంది. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్థ‌ల ప్రజాప్రతినిధులతో (Local Body Public Representatives) స‌మావేశం (Meeting) అయ్యారు.

ఇటీవల పార్లమెంటరీ స్థాయిలో పార్టీ పనితీరును సమీక్షించిన జగన్, ఇప్పుడు జిల్లా స్థాయి నుంచి మున్సిపాలిటీ వరకూ ఉన్న ప్రజాప్రతినిధులతో వ‌రుస‌గా కీల‌క స‌మావేశాలు జ‌రుపుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స్థానిక సంస్థ‌ల స‌మావేశాల్లో ప‌లు జిల్లాల‌కు చెందిన‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు సమావేశానికి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు ఇప్ప‌టికే తాడేప‌ల్లి (Tadepalli) వైసీపీ కేంద్ర కార్యాల‌యానికి (YSRCP Central Office) చేరుకున్నారు.

స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.. ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ చూపించిన తెగువ‌ను ముఖ్యంగా కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా ధైర్యంగా నిల‌బ‌డిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వైఎస్ జ‌గ‌న్ అభినందిస్తున్నారు. పార్టీతో వారి అనుబంధాన్ని బలపరిచేందుకు ఈ భేటీ ప్రాధాన్యత కలిగినదిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment