వివాదంపై విజయ్ దేవరకొండ వివర‌ణ‌

వివాదంపై విజయ్ దేవరకొండ వివర‌ణ‌

Summarize with AI

‘రెట్రో’ (Retro) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (Pre-Release Event)‌ లో చేసిన కామెంట్ల‌పై టాలీవుడ్ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) వివ‌ర‌ణ ఇచ్చారు. ఉగ్ర‌వాదం (Terrorism) గురించి మాట్లాడుతూ విజ‌య్ చేసిన కామెంట్స్ వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఆయ‌న కామెంట్స్‌ను వ్య‌తిరేకిస్తూ ప‌లువురు ఆదివాసీలు (Tribal People) పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐదు వందల ఏళ్ల కింద ట్రైబల్స్ (Tribals) కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు (Pakistan People) బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి’ అంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారు. గిరిజనులను అవమానించిన విజయ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ప‌లు ప్రాంతాల్లో ఫిర్యాదులు అందాయి. ఆ వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెల‌రేగ‌డంతో విజయ్ దేవరకొండ స్పందించారు.

తాను చేసిన ఒక వ్యాఖ్య కొంతమంది ప్రజలలో ఆందోళన కలిగించిందని త‌న దృష్టికి వచ్చిందని, ఏ సమాజాన్ని, ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలను (Scheduled Tribes) బాధపెట్టడం లేదా లక్ష్యంగా చేసుకోవడం త‌న ఉద్దేశ్యం కాదన్నారు. వారిని తాను ఎంతో గౌరవిస్తానని చెప్పారు. త‌న‌కు సమాజంలోని అన్ని వర్గాలపట్ల గౌరవం ఉందన్నారు. త‌న‌ మాటలు తప్పుగా అర్థం చేసుకుని ఎవరికైనా క్షోభ కలిగితే, హృదయపూర్వక విచారం వ్యక్తం చేస్తున్నానని సామాజిక మాధ్య‌మం ద్వారా వెల్ల‌డించారు. శాంతి, పురోగతి మరియు ఐక్యత గురించి మాట్లాడటమే త‌న ఏకైక లక్ష్యమ‌ని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు విజయ్ దేవరకొండ.

Join WhatsApp

Join Now

Leave a Comment