ప్రపంచంలో అత్యధిక వయస్సు కలిగిన మహిళగా గుర్తింపు పొందిన ఇనా కెనబారో లూకాస్ (Inah Canabarro Lucas) తుదిశ్వాస విడిచారు (Passed Away). ఆమె వయసు 116 సంవత్సరాలు. బ్రెజిల్ (Brazil) దేశానికి చెందిన లూకాస్ 1908 జూన్ 8న జన్మించారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే నన్‌గా మారిపోయారు.
ఆమె బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. 116 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటికీ లూకాస్‌కు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. ఆమెకు ఫుట్‌బాల్ పట్ల మక్కువ ఉండేది. ప్రతి పుట్టినరోజు వేడుకలో బ్రెజిల్ జాతీయ జట్టు స్కార్ఫ్, టీషర్ట్ ధరించి సెలబ్రేట్ చేసుకునే వారు. లూకాస్ మరణంతో ఇప్పుడు ఇంగ్లాండ్ (England) కు చెందిన ఎథెల్ కాటరోమ్ (వయస్సు 115) ప్రపంచంలోనే వృద్ధ మహిళగా నిలిచారు.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్