రూ.10 లక్షల మోసం కేసులో అరెస్టు అయిన అఘోరీ (Aghori) కి గౌరవ న్యాయస్థానం (Honourable Court) రిమాండ్ (Remand) విధించిన విషయం తెలిసిందే. కాగా, అఘోరీని సంగారెడ్డి (Sangareddy) లోని సెంట్రల్ జైలు (Central Jail) కు తరలించారు. కాగా, జైలు అధికారులు అఘోరీ ఆడా, మగా అనే ప్రశ్న వేశారు. లింగనిర్ధారణ తరువాతే బ్యారక్ (barrack) కేటాయిస్తామని తిప్పి పంపించారు. దీంతో అఘోరీకి కోర్టు ఆదేశాల మేరకు లింగనిర్ధారణ పరీక్ష నిర్వహించారు.
అఘోరీ అలియాస్ శ్రీనివాస్ (Aghori alias Srinivas).. ఉమెన్ ట్రాన్స్ జెండర్ గా గుర్తింపబడటంతో చంచల్ గూడ మహిళా జైలు (Chanchalguda Women’s Jail) కు తరలించారు. ఇటీవల యూపీ (Uttar Pradesh)లో అఘోరీని అరెస్టు చేసిన పోలీసులు.. నిన్న హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అఘోరీ శ్రీనివాస్ చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. అదే సమయంలో వర్షిణి (Varshini) ని భరోసా సెంటర్ (Bharosa Centre) కు తరలించినట్లు సమాచారం.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు