ఏపీ మంత్రివర్గ (Andhra Pradesh Cabinet) సమావేశంలో కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయం (Secretariat)లో నిర్వహించిన ఈ భేటీలో మొత్తం 24 అంశాలపై చర్చ సాగింది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ (Assembly), హైకోర్టు (High Court) నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా (Green Signal) ఊపింది. అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల (Permanent Buildings) నిర్మాణానికి సంబంధించిన టెండర్ల (Tenders)కు ఆమోదం తెలిపింది. రూ. 617 కోట్ల వ్యయంతోఅసెంబ్లీ భవనం, రూ. 786 కోట్లతో హైకోర్టు భవనం నిర్మించనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాత్కాలికం పేరుతో అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించారు. ఆ భవనాలను నిర్మించి పదేళ్లు కూడా పూర్తికాకపోవడం గమనార్హం.
- ఇతర కీలక నిర్ణయాలు
- ఎస్సీ ఉపవర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ ముసాయిదా ఆమోదం పై చర్చించనున్న కేబినెట్
- SIPB సమావేశం నిర్ణయాలకు ఆమోదం.
- ఏడు జిల్లాలలో సీనరేజ్ ఫీజు సేకరణ కాంట్రాక్ట్‌ల కాలం పొడిగింపు
- పరిశ్రమల శాఖలో G.O.Ms.No.49, 50, 51కి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల ర్యాటిఫికేషన్
- టీసీఎస్‌కి విశాఖ IT హిల్ 3లో 21.16 ఎకరాల భూమి కేవలం ఎకరా 99 పైసలకు కేటాయింపు – 1370 కోట్లు పెట్టుబడి, 12,000 ఉద్యోగ అవకాశాలు.
- URSA క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి భూముల కేటాయింపు – హిల్ 3 (SEZ)లో 3.5 ఎకరాలు, కపులుప్పాడలో 56.36 ఎకరాలు.
- నగరాల్లో వాతావరణ చర్యల అమలుకు రాష్ట్ర క్లైమేట్ సెంటర్ (S-C3) ఏర్పాటు ప్రతిపాదన.
- APCPDCL పరిధిలోని మిగిలిన 199 వ్యవసాయ ఫీడర్ల విభజన పనులకు DPRల ఆమోదం.
- బలి మెల, జలపుట డ్యామ్ పవర్ ప్రాజెక్టులను OPCLకి కేటాయింపు – 50% పవర్ APకి సరఫరా చేసే విధంగా ఒప్పందం
- కర్నూలు జిల్లా ఆస్పరిలో 88 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుకు JSW Neo Energy Ltd అనుమతి.
- విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కు – 3 సౌర ప్రాజెక్టుల (270MW x 3) కోసం అనుమతి.
- చింతా గ్రీన్ ఎనర్జీ కి 2000 MW AC ప్రాజెక్టుకు అనుమతి.
- అదే సంస్థ కు– 700 MW AC / 875 MWp ప్రాజెక్టుకు కూడా అనుమతి.
- గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ESIC హాస్పిటల్ నిర్మాణానికి భూమిని ఉచితంగా కేటాయింపు.
- ఎలూరు జిల్లాలో దేవాదాయ శాఖకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధికి భూమి కేటాయింపు.
- చిత్తూరు జిల్లా కుప్పంలో కేంద్ర విద్యాలయ స్థాపన కోసం ప్రభుత్వ భూమి- ప్రైవేట్ భూమి మార్పిడి.
- నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో APIICకి ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి కేటాయింపు.
- అదే మండలంలోని మరో 220 ఎకరాలు APIICకి ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయింపు.
- విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి భూమి కేటాయింపు.
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాల్వ ప్రాజెక్టు మోడరనైజేషన్ పనులకు ఆమోదం.
- వెలిగొండ ప్రాజెక్ట్‌లో కీలక పనులకు రూ.106.39 కోట్లు వినియోగానికి పరిపాలనా అనుమతి.
- పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ పనులకు నవయుగ సంస్థకు రూ.93.93 కోట్లు చెల్లింపు ఆమోదం.
- డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఒక వీడియోగ్రాఫర్ పోస్టును ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నెలకు రూ.60,000తో నియామకం.








