వనజీవి రామయ్య ఇకలేరు

వనజీవి రామయ్య ఇకలేరు

Summarize with AI

పద్మశ్రీ అవార్డు (Padma Shri Award) గ్రహీత, మొక్కల ప్రేమికుడు వనజీవి రామయ్య (Vanajeevi Ramayya) అనారోగ్యంతో కన్నుమూశారు (Passed Away). కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన, తుదిశ్వాస విడిచారు. అసలు పేరు రామయ్య అయినప్పటికీ, పర్యావరణంపై అపారమైన ప్రేమతో “వనజీవి (Vanajeevi)” అనే ఇంటిపేరుగా మార్చుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఖమ్మం (Khammam) రూరల్ మండలానికి చెందిన రామయ్య తన జీవితాన్ని మొక్కలకు (Plants) అంకితం చేశారు. సుమారు కోటి మొక్కలకుపైగా నాటి, వాటి సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ అపూర్వమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

పర్యావరణ పరిరక్షణలో ఆయన చూపిన ధృఢ సంకల్పం, పట్టుదల తరతరాలవారి కోసం ప్రేరణగా నిలుస్తుంది. వనజీవి రామయ్య జీవితం, ఆయ‌న అందించిన సేవలు భూమికి నిజమైన భక్తిగా నిలిచిన ఒక మహాత్ముని గాథగా మిగిలిపోతాయని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు, ప‌లువురు ప్ర‌ముఖులు రామ‌య్య మృతికి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ.. సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment