ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆర్టీసీ ఉద్యోగులు (RTC Employees) తమ డిమాండ్ల సాధన కోసం గురువారం (Thursday) నుంచి నిరసనలకు (Protests) దిగనున్నారు. పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, ఉద్యోగులు రెండు రోజుల పాటు ఎర్ర బ్యాడ్జీలు (Red Badges) ధరించి తమ ఆందోళనను వ్యక్తం చేయనున్నారు. ప్రభుత్వం 1/2019 సర్క్యులర్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, సస్పెన్షన్లు, తొలగింపులు లేకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, తక్షణమే ప్రమోషన్లు కల్పించడంతో పాటు, నైట్ అవుట్ అలవెన్స్ (Night-Out Allowance) ను రూ.150 నుంచి రూ.400కి పెంచాలని కోరుతున్నారు.
ప్రభుత్వ జీవో ప్రకారం మహిళా ఉద్యోగులకు చిన్నారుల సంరక్షణ సెలవులు ఇవ్వాలని, నాన్ ఆపరేషనల్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ (Demand) చేస్తున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) స్థానంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం, సంస్థ ద్వారా కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.








