బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న‌ MLA కుటుంబం

బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న‌ MLA కుటుంబం

Summarize with AI

బ్యాంకాక్‌ (Bangkok) లో సంభవించిన భారీ భూకంపం (Earthquake) నుంచి తెలంగాణ (Telangana) రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ (Raj Thakur) కుటుంబం (Family) తృటిలో ప్రాణాలు దక్కించుకుంది. ఆయన భార్య, కూతురు, అల్లుడు పర్యటన కోసం అక్కడికి వెళ్లగా, ఆకస్మాత్తుగా వచ్చిన భూకంపం ధాటికి అనేక భవనాలు కుప్పకూలాయి. అయితే, ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు.

విశ్వ‌స‌నీయ‌ సమాచారం ప్రకారం, MLA కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా విమానాశ్రయానికి చేరుకున్నారు. రాజ్ ఠాకూర్ మాత్రం హైదరాబాద్‌ (Hyderabad) లోనే ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ, వారు సుర‌క్షితంగా ఉండ‌డంతో ఎమ్మెల్యేతో పాటు అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment