నేడు కర్నూలులో పవన్ పర్యటన

నేడు కర్నూలులో పవన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (మార్చి 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. క‌ర్నూలులోని ఓర్వ‌క‌ల్లు మండ‌లం పూడిచెర్లలోని రైతు సూర రాజన్న పొలంలో పవన్ కళ్యాణ్ ఫారం పాండ్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్షించారు. సుమారు 4,000 మంది ప్రజలు సభకు హాజరయ్యే అవకాశముండటంతో, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పూడిచెర్ల కార్యక్రమం పూర్తయ్యాక, పవన్ కళ్యాణ్ కర్నూలు ఎయిర్‌పోర్ట్ చేరుకుని, ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment