రన్యారావు కేసులో తెలుగు నటుడు అరెస్ట్

రన్యారావు కేసులో తెలుగు నటుడు అరెస్ట్

బంగారం స్మగ్లింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డిన న‌టి రన్యారావు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రముఖ తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, తరుణ్ రాజ్ కొండూరు ఈ అక్రమ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రన్యారావు వెనుక అసలు కింగ్‌పిన్ తరుణ్ అనే ప్రచారం కూడా సాగుతోంది.

తరుణ్ రాజ్ ‘పరిచయం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే, ఇప్పుడీ కేసుతో అతని పేరు చర్చనీయాంశమైంది. ఈ అరెస్టుతో కేసు మరింత కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులో మరికొందరు ప్రముఖుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Join WhatsApp

Join Now

Leave a Comment