టాలీవుడ్‌లో యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న శిల్పా చక్రవర్తి ఇటీవల బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. “బిగ్ బాస్ నా జీవితాన్ని నాశనం చేసింది” అంటూ షో తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని ఎమోషనల్ అయింది. శిల్పా గతంలో సుమకు గట్టి పోటీ ఇచ్చే యాంకర్‌గా రాణించింది. వివాహం అనంతరం కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన ఆమె, “బిగ్ బాస్-3” ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ షో తర్వాత ఆమె తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నట్లు చెప్పింది.
డిప్రెషన్.. ట్రోలింగ్
తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో పోస్ట్ చేసిన శిల్పా, బిగ్ బాస్ తర్వాత వచ్చిన నెగటివ్ ట్రోలింగ్ గురించి చెప్పింది. “ఎప్పుడూ వేల మందికి యాంకరింగ్ చేసిన నేను, ట్రోల్స్‌కి భయపడి మాట్లాడలేకపోయాను” అంటూ తన బాధను వ్యక్తం చేసింది. “కొంత మంది వ్యక్తిగత దూషణలు చేశారు, బూతులు తిట్టారు. దీంతో చాలా డిప్రెషన్‌కు గురయ్యాను. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి నాలుగు నెలలు పట్టింది. నాకెంతో ఆనందం ఇచ్చే యాంకరింగ్ కూడా చేయాలనే ఉత్సాహం పోయింది” అని చెప్పింది.
వ్యక్తిగత జీవితంలో కూడా వరుస కష్టాలు
కరోనా సమయంలో తండ్రిని కోల్పోవడం, తల్లి క్యాన్సర్‌తో పోరాడటం లాంటి వ్యక్తిగత విషాదాలు కూడా చాలా దెబ్బతీశాయని శిల్పా చెప్పారు. “నా తండ్రి కిందపడ్డప్పుడు వెంటనే సర్జరీ చేయాల్సి ఉన్నా, కరోనా సమయంలో ఆసుపత్రులు తీసుకోవడం లేదు. చివరికి ఆయన హాస్పిటల్ బెడ్ మీదే చనిపోయారు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ అనుభవం ఆమె జీవితాన్ని ఈ స్థాయిలో ప్రభావితం చేసిందని తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు.








