పిల్లలు చనిపోతుంటే ఫొటోషూట్‌లా? – జెలెన్ స్కీపై మస్క్ ఆగ్రహం

పిల్లలు చనిపోతుంటే ఫొటోషూట్‌లా? – జెలెన్ స్కీపై మస్క్ ఆగ్రహం

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, ప్రముఖ వ్యాపారవేత్త దిగ్గ‌జం ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది సైనికులు, అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే, జెలెన్ స్కీ మాత్రం భార్య ఒలెనా జెలెన్ స్కీతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొనడం ఏంటి? అంటూ మస్క్ ప్రశ్నించారు.

యుద్ధం మద్యలో వివాదాస్పద ఫొటోషూట్
2022లో ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ ప్రారంభమైన తర్వాత భీకర యుద్ధం చోటు చేసుకుంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే, అదే సమయంలో జెలెన్ స్కీ తన భార్యతో కలిసి ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్‌కు ఫొటోలు తీయించుకున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎలోన్ మస్క్ కాకుండా, రిపబ్లికన్ కాంగ్రెస్ మహిళా లారెన్ బోబర్ట్, టెక్సాస్ కాంగ్రెస్ మహిళా మైరా ఫ్లోర్స్ కూడా జెలెన్ స్కీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. మేము మానవతా దృక్పథంతో సహాయం చేస్తుంటే, ఆయన మాత్రం తమను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

శాంతి చర్చలపై కొత్త వివాదం
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, జెలెన్ స్కీ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగడం లేదని, శాంతి చర్చలకు అతడు ముప్పుతిప్పలు పెడుతున్నాడని విమర్శించారు. ప్రస్తుతానికి రష్యా-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా, ఉక్రెయిన్‌ను ఆ చర్చలకు ఆహ్వానించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో, జెలెన్ స్కీపై మస్క్ చేసిన విమర్శలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment