“లోకేష్ చేతిలో అధికారం.. పిచ్చోడి చేతిలో రాయి” – వైసీపీ ఘాటు ట్వీట్‌

“లోకేష్ చేతిలో అధికారం.. పిచ్చోడి చేతిలో రాయి” - వైసీపీ ఘాటు ట్వీట్‌

కదిరి నియోజ‌క‌వ‌ర్గం (Kadiri Constituency) తనకల్లులో గ‌ర్భిణీ (Pregnant Woman)పై దాడి ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దాడికి పాల్ప‌డిన వ్య‌క్తి వైసీపీకి చెందిన వాడ‌ని మొద‌ట ప్ర‌చారం చేసినా, అది అవాస్త‌వం అని ఆధారాల‌తో స‌హా తేలిపోయింది. అజ‌య్ దేవ‌ (Ajay Deva) ప‌వ‌న్ (Pawan Kalyan) వీరాభిమాని అని, జ‌న‌సేన క్రియాశీల‌క కార్య‌క‌ర్త అని సొంత పార్టీ ఎంపీటీసీ బ‌య‌ట‌పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది.

నారా లోకేష్(Nara Lokesh) చేతిలో అధికారం (Power) పిచ్చోడి చేతిలో రాయిలా మారిందనడానికి కదిరి ఘటన ప్రత్యక్ష ఉదాహరణ అంటూ వైసీపీ(YSRCP) చేసిన ట్వీట్ రాజకీయంగా సంచలనం రేపింది. గర్భిణీ మహిళపై దాడి ఘటనను వక్రీకరిస్తూ వైసీపీపై నిందలు మోపుతున్నారని, ఈ విషయంలో టీడీపీ(TDP), ఎల్లో మీడియా పూర్తిగా అసత్య ప్రచారం చేస్తున్నాయని వైసీపీ ఆరోపించింది.

కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారిపల్లెలో గర్భిణీ మహిళను అజయ్ దేవ అనే వ్యక్తి కాలితో తన్నాడని, అతడు వైసీపీ కార్యకర్తనని నారా లోకేష్, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వైసీపీ స్పష్టం చేసింది. అజయ్ దేవ ఎప్పుడూ వైసీపీ జెండా పట్టుకోలేదని, అతనికి పార్టీతో ఎలాంటి సభ్యత్వం కూడా లేదని ట్వీట్‌లో పేర్కొంది.

అజయ్ దేవ కరుడుగట్టిన జనసేన పార్టీ(Jana Sena Party) కార్యకర్త అని వెల్లడించింది. అతని సోషల్ మీడియా ఖాతాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటోలే దర్శనమిస్తున్నాయని, శరీరంపై పవన్ కళ్యాణ్ టాటూలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఈ అంశాలకు సంబంధించిన సాక్ష్యాలను కూడా బయటపెట్టామని వైసీపీ ట్వీట్‌లో తెలిపింది.

ఈ ఘటనపై జనసేన పార్టీకి చెందిన స్థానిక ఎంపీటీసీ అమర్(MPTC Amar) కూడా స్పందించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి అజయ్ దేవ అని, అతను జనసేన పార్టీ కార్యకర్త అని తెలిపారు. గర్భిణీ మహిళను కాలితో తన్నాడన్న ఆరోపణలను ఆయన ఖండించారు. రెండు కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయని, గొడవ సమయంలో అజయ్ దేవ తన తండ్రితో వాగ్వాదం జరుగుతుండగా గర్భిణీ మహిళను చేతితో తోశాడని మాత్రమే పేర్కొన్నారు. బాధితురాలు అజయ్ దేవకు సొంత వదినేనని కూడా తెలిపారు.

వాస్తవాలు ఇలా ఉండగా ఘటనను కావాలనే వైసీపీపై రుద్దేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని నారా లోకేష్‌ను వైసీపీ ప్రశ్నించింది. రాజకీయ లబ్ధి కోసం ఘటనలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment