‘వెన్నుపోటుకు రెండేళ్లు’.. పోరాటానికి వైఎస్ జగన్ సంచలన పిలుపు

‘వెన్నుపోటుకు రెండేళ్లు’.. పోరాటానికి వైఎస్ జగన్ సంచలన పిలుపు

కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాలనపై వైసీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు రెండేళ్ల పాలనను “రాక్షస పాలన”(Demonic Rule)గా అభివర్ణించారు. “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ”(“Babu Surety – Fraud Guarantee”) అని ఈ రెండేళ్లలోనే రుజువైందని, ఎన్నికల మేనిఫెస్టోను (Election Manifesto) చంద్రబాబు పూర్తిగా చెత్తబుట్టలో వేశారని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలు, వైఫల్యాలను ఎండగడుతూ జూన్ 4 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా “వెన్నుపోటుకు రెండేళ్లు’’ పేరుతో భారీ నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు జగన్ ప్రకటించారు.

సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్'(‘Super Six, Super Seven’) సహా మొత్తం 143 రకాల హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించారని గుర్తుచేశారు. తీరా ఓట్లు వేయించుకున్నాక ఇప్పుడు ప్రజలను, రాష్ట్రాన్ని తినేయడం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఊసే లేదని.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, యాభై ఏళ్లకే పెన్షన్ వంటి ప్రధాన హామీలను బుట్టదాఖలు చేశారని విమర్శించారు. అధికారంలోకి రాగానే పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పుడు రాష్ట్ర పన్నులను తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. “మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడ?” అని లేదా పెట్రోల్ ధరల తగ్గింపు గురించి ప్రశ్నిస్తే చంద్రబాబుకు తీవ్రంగా బీపీ పెరుగుతోందని, ‘మావిగన్’ (MaViGun) లాంటి అంశాలు వస్తే ఆయన తట్టుకోలేకపోతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

తప్పుడు ప్రచారాలు.. డైవర్షన్ పాలిటిక్స్
తాము ప్రజలకు చేసిన మంచిని చెప్పుకునే పరిస్థితి లేకే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు (Diversion Politics) తెరతీశారని జగన్ ఆరోపించారు. “గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ తప్పుడు ప్రచారాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలు అమాయకులు కారు, చైతన్యవంతులు” అని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా, పేదవాడి నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లాయన్నా అది వైఎస్సార్, జగనన్న పాలనలోనే సాధ్యమైందని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తాము ప్రతి ఇంటికీ గర్వంగా వెళ్లగలమని ధీమా వ్యక్తం చేశారు.

“వెన్నుపోటుకు రెండేళ్లు” – నిరసనల షెడ్యూల్
చంద్రబాబు చేసిన మోసాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతిభద్రతల విషయంలో చేసిన అన్యాయాలన్నింటినీ వివరిస్తూ వైసీపీ ఒక ప్రత్యేక బుక్‌లెట్‌ను రూపొందించింది. ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేర్చాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జూన్ మొదటి వారంలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రకటించారు.

  • “జూన్‌ 4 నుంచి 12 వరకూ “వెన్నుపోటుకు రెండేళ్లు’’ పేరుతో కార్యక్రమాలు చేస్తున్నాం. 
  • జూన్‌ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం. 
  • చంద్రబాబు మోసాల మేనిఫెస్టోను, ప్రజలను నమ్మించేందుకు ఇచ్చిన బాండ్లను ప్రదర్శిస్తూ, దాన్ని దగ్ధం చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదో ఒక మండల కేంద్రంలో ఇన్‌ఛార్జి పాల్గొనాలి.
  • జూన్‌ 8 లేదా 9, ఈ రెండు రోజుల్లో ఒకరోజు నియోజకవర్గ కేంద్రాల్లో “వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమం కింద టౌన్‌హాల్‌ సదస్సులు నిర్వహిస్తున్నాం. రెండేళ్ల రాక్షసపాలనపై అక్కడ చర్చ చేయాలి. ఇందులో రైతులు, మహిళలు, యువత తదితర వర్గాల వారంతా పాల్గొంటారు. 
  • చివరగా జూన్‌ 12వ తేదీన ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో, రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం.  ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయన్నదానిపై నేను కూడా పర్యవేక్షణ చేస్తున్నాను.” అని వైఎస్ జగన్ చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment