“ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్?” – జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

"ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్?" - జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీది (YSRCP) గొడ్డ‌లి పార్టీ అని ప్ర‌తి స‌భ‌, స‌మావేశంలోనూ ఊద‌ర‌గొడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై (Nara Chandrababu Naidu) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘జంగిల్ రాజ్'(Jungle Raj) (అరాచక పాలన) సాగుతోందని మండిపడ్డారు. శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా?
“రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ?(Axe Party) ఎవరిది గన్ కల్చర్?(Gun Culture) ఎవరివి హత్యా రాజకీయాలు?” అని వైఎస్ జగన్ (YS Jagan) నేరుగా చంద్రబాబును ప్రశ్నించారు. గత చరిత్రను ప్రస్తావిస్తూ.. “చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉండగానే నా తాత వైఎస్ రాజారెడ్డిని(Y. S. Raja Reddy) దారుణంగా నరికి చంపేశారు. రాజారెడ్డిని చంపింది టీడీపీ(TDP) వాళ్లు కాదా బాబూ?” అని నిలదీశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (Y. S. Rajasekhara Reddy) (YSR) మరణంపై కూడా ఇప్పటికీ నివృత్తి కాని ఎన్నో అంశాలు ఉన్నాయని జగన్ గుర్తుచేశారు. “మా నాన్నను అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్న రెండు మూడు రోజులకే హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. వైఎస్సార్ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఒకసారి అసెంబ్లీ క్లిప్పింగ్‌లు చూడాలి” అని జగన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వివేకా హత్య చంద్రబాబు హయాంలోనే..
తమ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి (Y. S. Vivekananda Reddy) హత్యోదంతంపై కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మా చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే జరిగింది. ఆ కేసులో చంపినవాడు (దస్తగిరి) ఈరోజు దర్జాగా కారులో తిరుగుతున్నాడు” అని విమర్శించారు.

“నేను మంచివాడిని కాబట్టే వాళ్లు బతుకుతున్నారు”
“మేము ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తాం. ఈ మాట నేను చాలా గర్వంగా చెబుతున్నాను. వైఎస్ జగన్ మంచివాడు కాబట్టే.. మా తాత రాజారెడ్డిని దారుణంగా నరికి చంపిన వారు కూడా ఈరోజు సమాజంలో ప్రశాంతంగా బతుకుతున్నారు. ఒకవేళ జగన్ చెడ్డవాడై ఉంటే వాళ్లంతా ఈపాటికి బతికి ఉండేవాళ్లా?” అని జగన్ ప్రశ్నించారు. తమ తండ్రి వైఎస్సార్ తమకు చంద్రబాబులా హత్యలు చేయడం నేర్పించలేదని, ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవడమే నేర్పించారని, అదే తమకు చంద్రబాబుకు ఉన్న తేడా అని స్పష్టం చేశారు.

77 ఏళ్ల వయస్సులో దౌర్భాగ్య రాజకీయాలా?
రాజకీయాల్లో కుట్రలు, గొడ్డళ్లు, గునపాలు ఎవరికి అవసరమో ప్రజలకు బాగా తెలుసన్న జగన్.. చంద్రబాబు వయస్సును ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు మీకు ఇప్పుడు 77 ఏళ్ల వయస్సు వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి 80 ఏళ్లు వస్తాయి. బహుశా మీకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. ఈ వయస్సులో కూడా ఇంత దౌర్భాగ్యమైన, నీచమైన రాజకీయాలు చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా?” అని నిలదీశారు.

టాపిక్ డైవర్షన్ చేయడంలో సిద్ధహస్తుడు
ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతోందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో పడినా, ప్రజా వ్యతిరేకత ఎదురైనా.. ప్రజల్లోకి ఆ విషయాలు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు, ఆయన మంత్రులు అబద్ధాలకు రెక్కలు కట్టి కొత్త టాపిక్‌లను తెరపైకి తెస్తారని విమర్శించారు. ఒక అబద్ధాన్ని సృష్టించి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అసలు సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడమే చంద్రబాబు నైజమని వైఎస్ జగన్ మండిపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment