త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను(Local Body Elections) వైసీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) క్యాడర్‌కు కీలక ఆదేశాలిచ్చారు. ఎన్నికలన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు, కోఆర్డినేటర్లకు కీలక ఆదేశాలిచ్చారు. చంద్రబాబు (Nara Chandrababu Naidu) అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని, ఆ కుట్రలను ఎదుర్కొంటూ దీటుగా నిలబడాలని సూచించారు.
జగన్ కీలక ఆదేశాలు
“స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైసీపీ జెండా ఎగరాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే దాన్ని నేను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. అలా జరిగితే అది ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఫెయిల్యూర్‌గానే భావిస్తాను” అని వార్నింగ్ ఇచ్చారు. పోటీ చేసే ప్రతి కార్యకర్తకూ అండగా నిలబడితేనే, వాళ్లే రేపు జనరల్ ఎన్నికల్లో పార్టీకి బలగంగా నిలుస్తారని, నిరంతరం ప్రజల్లో ఉండే యాక్టివ్ లీడర్లను గుర్తించి పోటీకి సిద్ధం చేయాలని ఆదేశించారు.
SIR, బోగస్ ఓట్లపై సంచలన వ్యాఖ్యలు
ఇటీవల దేశవ్యాప్తంగా ఎన్నికలను ప్రభావితం చేసినట్లు చర్చ జరుగుతున్న SIR (Systematic Inclusion/Removal – ఓట్ల తొలగింపు వ్యవహారాలు) పై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాల ఉదాహరణలను ఆయన క్యాడర్‌కు వివరించారు. పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) దాదాపు 91 లక్షల ఓట్లు (11.9%) తొలగించారు. మమతా బెనర్జీ భవానీపూర్‌లో 44,990 ఓట్లు కోల్పోగా, ఆమె కేవలం 15,105 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్ నియోజకవర్గంలో 71,133 ఓట్లు తొలగించగా, ఆయన 8 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారని చెబుతూ, ఎస్ఐఆర్ సర్వే పట్ల క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
“ఒక ఊరికి 50 మన ఓట్లను తీసేస్తే, నియోజకవర్గానికి 5 వేల ఓట్లు పోయినట్టే. అందుకే SIRపై చాలా జాగ్రత్తగా ఉండాలి” అని హెచ్చరించారు. అదే సమయంలో టీడీపీ బోగస్ ఓట్లపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. కుప్పం నియోజకవర్గ ఓటర్ల జాబితాలోనే 22 వేల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని, ఒకే పేరు, ఒకే తండ్రి/భర్త పేరుతో 5 నుండి 10 సార్లు ఓట్లు కనిపిస్తున్నాయని.. “బాబు హిస్టరీ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇదే” అంటూ జగన్ సంచలన ఆరోపణలు చేశారు.
SIR సర్వే పట్ల వైసీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి
— Telugu Feed (@Telugufeedsite) May 27, 2026
పశ్చిమ బెంగాల్‌లో 91 లక్షల ఓట్లను తొలగిస్తే.. #TMC ఓడిపోయింది 31 లక్షల తేడాతో..
తమిళనాడులో 74 లక్షల ఓట్లను తొలగిస్తే.. #DMK ఓడింది 17 లక్షల తేడాతో..
మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో… pic.twitter.com/itWE0itl8t








