లండన్ టూర్‌కు జ‌గ‌న్.. న్యూ లుక్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) దంపతులు లండన్ పర్యటనకు (London Tour) బయలుదేరారు. శనివారం అర్ధరాత్రి బెంగళూరు (Bengaluru) నుంచి నేరుగా లండన్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలను కలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

జగన్ దంపతులు దాదాపు 15 రోజుల పాటు లండన్‌లోనే ఉండనున్నారు. ఈ సమయంలో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో సమయం గడపనున్నట్లు తెలుస్తోంది. మే 10వ తేదీన తిరిగి బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంది.

నయా లుక్‌లో జగన్.. అభిమానులు ఫిదా
లండన్ పర్యటనకు బయలుదేరిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్‌లో (New Look) కనిపించారు. సాధారణంగా వైట్ షర్ట్, గోధుమ రంగు ప్యాంటుతో కనిపించే జగన్ ఈసారి స్టైలిష్‌గా దర్శనమిచ్చారు.

జీన్స్ ప్యాంట్, బ్లూ డెనిమ్ షర్ట్, షూస్ ధరించి కనిపించిన జగన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వైసీపీ అభిమానులు (YSRCP Fans) తెగ సంబరపడుతున్నారు.

“మా బాస్ అచ్చం హీరోలా(Hero) ఉన్నాడు” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులు సందడి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment