రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్థులు మృతిచెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాయ్‌చూర్ జిల్లా సింధనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వేద విద్యార్థులు మృతిచెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమానికి వెళ్తుండగా, వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసిందని, చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని వైఎస్ జగన్ కోరారు.
News Wire
-
01
పెదకూరపాడులో దారుణం
ఇంట్లోకి చొరబడి దంపతులపై కత్తులతో దాడి చేసిన దుండగులు. ఆధార్ కార్డు కావాలని ఇంట్లోకి వచ్చి దాడి. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
-
02
హైదరాబాద్‌లో ఎనిమిది కాలేజీలపై కేసులు
నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించారనే ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఎనిమిది విద్యాసంస్థలపై కేసులు నమోదయ్యాయి
-
03
నేరస్థులను విదేశాల నుంచి భారత్‌కు
2021 నుంచి ఇప్పటివరకు 36 దేశాల నుంచి మొత్తం 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారత్‌కు తీసుకువచ్చినట్లు కేంద్రం ప్రకటన
-
04
పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
మధ్యప్రదేశ్, అసోం, కేరళ, మేఘాలయ సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న IMD
-
05
హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ
హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు, కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఎనిమిది ప్రైవేట్ కాలేజీలు. లేక్ పోలీస్ స్టేషన్లో కేసు
-
06
దేవరపల్లిలో వైఎస్ జగన్..
పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు దేవరపల్లికి మాజీ సీఎం. కాసేపట్లో పొగాకు కేంద్రం సందర్శన. పొగాకు రైతులతో మాట్లాడనున్న జగన్
-
07
ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్
తంజావూరు కేసులో బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు. విచారణ తర్వాత ఉదయనిధిని విడుదల చేయాలి అని ఆదేశాలు
-
08
టీ-ఫైబర్‌పై సమీక్ష
సచివాలయంలో 'టీ-ఫైబర్'పై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. హాజరైన సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్
-
09
ఉదయ నిధి స్టాలిన్ అరెస్ట్
చెన్నైలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సీఎం విజయ్, నటి త్రిషపై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారని కేసు
-
10
ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం
కారంపూడి ఎస్ఐ వేధిస్తున్నాడని, పీఎస్‌కు పిలిచి తన భర్తను చిత్రహింసలు పెడుతున్నాడని గాదేవారిపల్లెకు మహిళ ఆత్మహత్యాయత్నం









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర