“వర్మ.. తమ్ముడిని బాగా చదివించమ్మా. నువ్వు కూడా బాగా చదువుకోమ్మా.. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి.. ఉంటాను డాడీ…” అంటూ కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తూ, అంబులెన్స్‌లో స్ట్రెచర్‌పై పడుకుని ఓ తండ్రి తన పెద్ద కొడుక్కి చెప్పిన చివరి మాటలివి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కార్మికుడు పైడిరాజు మాట్లాడిన ఈ మాటల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఒంటి నిండా మంటలు పుట్టించే కాలిన గాయాలు ఉన్నా.. ఆ నరకయాతన కంటే కూడా ‘తాను లేకపోతే తన కుటుంబం ఏమైపోతుంది? తన భార్య, పిల్లల పరిస్థితి ఏంటి?’ అన్న ఆవేదనే ఆ తండ్రిని ఎక్కువగా కలిచివేసింది.
1500 డిగ్రీల వేడితో ఉన్న ద్రవ ఉక్కు ఒంటిపై పడటంతో స్టీల్ ప్లాంట్ కార్మికుడు పైడిరాజు శరీరం తీవ్రంగా కాలిపోయింది. ప్రాణాలు నిలుస్తాయో లేదో తెలియని అత్యంత విషమ పరిస్థితి. అయినా సరే, ఆ నొప్పిని భరిస్తూనే తన తోటి కార్మికుడి పిలిచి తన చివరి మాటల వీడియో తీయించుకున్నాడు. “తమ్ముడిని బాగా చదివించు.. నువ్వు బాగా చదువుకో.. అమ్మను బాగా చూసుకోండి.. ఉంటాను డాడీ” అంటూ అంబులెన్స్‌లోనే వీడియో ద్వారా తన కొడుక్కు బాధ్యతలు అప్పగించిన వీడియో కంటతడి పెట్టిస్తోంది.
ఈ ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబాల్లో ఎంతటి విషాదం నిండిందో చెప్పడానికి పైడిరాజు మాట్లాడిన ఈ ఒక్క వీడియోనే నిదర్శనం. కాలిన గాయాల నొప్పితో నరకం అనుభవిస్తూనే, బిడ్డల కోసం ఆయన పడ్డ తపన చూసి నెటిజన్లు కన్నీరు మున్నీరవుతున్నారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుడి మాటలు..
— Telugu Feed (@Telugufeedsite) June 9, 2026
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు పైడిరాజు
'వర్మ.. తమ్ముడిని బాగా చదివించు. నువ్వు కూడా బాగా చదువుకో.. అమ్మను బాగా చూసుకోండి.. ఉంటాను డాడీ' అంటూ భావోద్వేగానికి లోనైన పైడిరాజు
కంటతడి… pic.twitter.com/t7CP7kTwRa








