‘ఐ డోంట్ కేర్’ అంటున్న మలైకా.. వీరి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

'ఐ డోంట్ కేర్' అంటున్న మలైకా.. యంగ్‌స్టార్‌తో డేటింగ్‌

Summarize with AI

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరా (Malaika Arora) మళ్లీ వార్తల్లో నిలిచారు. తన పర్సనల్ లైఫ్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉండే ఈ భామ, ఈసారి కూడా నెటిజన్లకు ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్‌ ఇచ్చారు. నటుడు అర్జున్ కపూర్‌తో (Arjun Kapoor) కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి, ఆ తర్వాత సైలెంట్‌గా విడిపోయిన మలైకా జీవితంలోకి ఇప్పుడు మరో ‘మిస్టరీ మ్యాన్'(Mystery Man) వచ్చాడనే వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. అత‌డే ముంబైకి చెందిన హర్ష్ మెహతా.

ప్రస్తుతం మలైకా అరోరా వయస్సు 52 ఏళ్లు కాగా, హర్ష్ మెహతా (Harsh Mehta) వయస్సు 33 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య దాదాపు 19 ఏళ్ల వయస్సు వ్యత్యాసం. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు, ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు. గతంలో తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ (Dating) చేసినప్పుడు ఎంతో విమర్శలు ఎదుర్కొన్న మలైకా, ఇప్పుడు మరోసారి తన కంటే చాలా చిన్నవారితో జతకట్టడంపై రకరకాల కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. “మలైకాకు కుర్రాళ్లే దొరుకుతారా?, ఈజ్ ఇట్ ఏ న్యూ ట్రెండ్?” (Is It a New Trend?) అంటూ నెటిజన్లు మీమ్స్‌తో ఆడుకుంటున్నారు.

కాన్సర్ట్‌లు, డిన్నర్ డేట్‌లు.. ఇటలీ టూర్లు!
మలైకా, హర్ష్ మెహతా ఇద్దరూ కలిసి ముంబైలో జరిగిన ఎన్రిక్ ఇగ్లేసియాస్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో సందడి చేయడం దగ్గర నుంచి, ఇటీవలే ఇటలీలోని (Italy) రోమ్‌లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ వరకు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ముంబైలోని బాంద్రా రెస్టారెంట్ల వద్ద ఇద్దరూ కలిసి కెమెరాలకు చిక్కడం. ఇటీవల మలైకా కుమారుడు అర్హాన్ ఖాన్‌తో కలిసి హర్ష్ మెహతా డిన్నర్ డేట్‌కు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.

ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరిగినా మలైకా అరోరా మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. “నా జీవితం.. నా ఇష్టం” అన్నట్లుగా తన లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ప్రైవేట్ ఈవెంట్లు, డిన్నర్లు, వెకేషన్లలో హర్ష్ మెహతాతో కలిసి కనిపిస్తూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇస్తోంది. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ తమ సంబంధంపై అధికారికంగా స్పందించలేదు. అర్జున్ కపూర్ అధ్యాయం ముగిశాక, హర్ష్ మెహతాతో నయా పయనం మొదలుపెట్టిన మలైకా.. ఈ డేటింగ్ రూమర్లకు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment