ప్రఖ్యాత మలయాళ (Malayalam) నటుడు (Actor) విష్ణుప్రసాద్ (Vishnu Prasad) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధి (Liver-Related Disease)తో బాధపడుతున్న ఆయన, కేరళ (Kerala) రాష్ట్రంలోని ఎర్నాకులం (Ernakulam) ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. విష్ణుప్రసాద్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో వైద్యం కోసం భారీగా ఖర్చులు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య ఖర్చులను సమకూర్చేందుకు వారు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించి, వైద్యానికి సహకరించని స్థాయికి వెళ్లిపోయారు.
తమిళ (Tamil) సినిమా కాశి ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన విష్ణుప్రసాద్, మలయాళ పరిశ్రమలో గుర్తింపు పొందారు. రన్వే, లయన్, బెన్ జాన్సన్, లోకనాథన్ IAS వంటి అనేక హిట్ (Hit) చిత్రాల్లో ఆయన నటించారు. విష్ణుప్రసాద్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సహనటులు సంతాపం వ్యక్తం చేశారు.








ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు