పిఠాపురంలో రెబల్స్.. గెలిచి పవన్‌కే షాక్ ఇచ్చిన జ‌న‌సైనిక్స్‌

పిఠాపురంలో రెబల్స్.. గెలిచి పవన్‌కే షాక్ ఇచ్చిన జ‌న‌సైనిక్స్‌

Summarize with AI

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో(Pithapuram Constituency) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత(Jana Sena Chief) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సొంత అడ్డాలోనే ఆయన రాజకీయ భవిష్యత్తుకు రెబల్ అభ్యర్థులు (Rebel Candidates) గట్టి డేంజర్ బెల్స్(Danger Bells) మోగించారు. గతంలో భీమవరం(Bhimavaram), గాజువాక (Gajuwaka) నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయి, సేఫ్ జోన్ కోసం పిఠాపురానికి మకాం మార్చుకుని ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్‌కు సొంత నియోజకవర్గ ఓటర్లు, కార్యకర్తలే సరికొత్త తిరుగుబాటును ప‌రిచ‌యం చేశారు.

డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్ తన సొంత మున్సిపాలిటీలో సొంత పార్టీ శ్రేణులనే అదుపు చేయలేక తీవ్రంగా విఫలమయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.

పిఠాపురం మున్సిపాలిటీలో(Pithapuram Municipality) మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వీటిలో జనసేన పార్టీకి (Jana Sena Party) 3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 23 వార్డుల్లో జనసేన పార్టీ అధికారిక అభ్యర్థులను నిలిపితే, ఆ పార్టీకి చెందిన ఏకంగా 11 మంది నాయకులు రెబల్స్‌గా బరిలోకి దిగారు. మిత్రపక్షమైన టీడీపీకి(TDP) 9 స్థానాలు కేటాయిస్తే, అక్కడ మరో 10 మంది టీడీపీ రెబల్స్‌గా నిలబడ్డారు.

‘పోటీ నుంచి తప్పుకోవాలి, పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలి’ అని స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆజ్ఞాపించినా.. పిఠాపురం జనసేన, టీడీపీ నాయకులు ఆయన మాటను కనీసం లెక్కచేయలేదు. “తగ్గేదేలే” అంటూ బరిలో నిలిచి, అధిష్టానానికే షాక్ ఇచ్చేలా విజయం సాధించారు.

ఓట్ల లెక్కింపు(Vote Counting) పూర్తయ్యాక వెలువడిన ఫలితాలు పవన్ కళ్యాణ్ నాయకత్వానికే పెద్ద మచ్చగా నిలిచాయి. ఇక్కడ జనసేన 16, టీడీపీ(TDP) 5, బీజేపీ(BJP) 1, వైసీపీ(YSRCP) 1 స్థానంలో గెలుపొందగా.. ఏకంగా 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచి సంచలనం సృష్టించారు.

గెలిచిన 10 మంది స్వతంత్రులలో ఏకంగా 8 మంది కూటమికి చెందిన రెబల్స్ ఉండటం విశేషం. జనసేన కార్యకర్తలే పవన్ కళ్యాణ్ మాట లెక్క‌చేయ‌కుండా పోటీలో నిలిచి గెల‌వ‌డం ఆయన బలహీన నాయకత్వానికి అద్దం పడుతోందంటున్నారు జ‌న‌సేన స్థానిక క్యాడ‌ర్‌. రెబల్స్ సాధించిన విజయాలు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకున్న టికెట్ కేటాయింపు నిర్ణ‌యాల (Ticket Allocation Decisions) డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెడుతోంది.

గాజువాక, భీమవరంలలో ఎదురైన చేదు అనుభవాల తర్వాత పిఠాపురానికి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్‌కు, రాబోయే రోజుల్లో ఈ రెబల్స్ అంతా జనసేన వెంటే ఉంటారనే నమ్మకం ఏమాత్రం లేదు. పిఠాపురంపై పవన్ ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయి సమస్యలను, కార్యకర్తల అసంతృప్తిని పరిష్కరించకపోతే.. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆయనకు ఇక్కడ మళ్లీ పరాభవం తప్పదనే స్పష్టమైన హెచ్చరికను ఈ ఎన్నికల తీర్పు ద్వారా స్వయంగా జనసేన తమ్ముళ్లే పంపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment