విక్రమ్ కొత్త మూవీపై ఇండస్ట్రీలో బజ్

విక్రమ్ కొత్త మూవీపై ఇండస్ట్రీలో బజ్

2016లో వచ్చిన స్పై థ్రిల్లర్ సినిమాతో మళ్లీ హిట్ కాంబినేషన్‌ను రుచి చూపించిన విక్రమ్ – డైరెక్టర్ ఆనంద్ శంకర్ జోడీ ఇప్పుడు మరోసారి కలవబోతున్నారన్న వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ సినిమాలో నయనతార, నిత్యా మీనన్ హీరోయిన్స్‌గా నటించగా, విక్రమ్ డ్యూయల్ రోల్‌లో కొత్త అవతారంలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా హరీష్ జయరాజ్ పేరు వినిపిస్తుండగా, మే నెలలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే టార్గెట్‌తో టీమ్ ముందుకు వెళ్తోంది. బడ్జెట్‌ను మొదట 60–65 కోట్లుగా ప్లాన్ చేసినా, చివరికి 50–55 కోట్ల మధ్యలో ఫిక్స్ చేసినట్టు సమాచారం. విక్రమ్ కూడా తన రెమ్యునరేషన్‌ను తగ్గించి ప్రాఫిట్ షేర్ డీల్‌కు ఒప్పుకోవడం ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. ఏప్రిల్ 17న అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉండటంతో, ఈ కాంబోపై అంచనాలు మరింత పెరిగాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment