ఇంద్రకీలాద్రిపై దివ్యాంగ భ‌క్తుడిపై పాశవికంగా దాడి (Video)

ఇంద్రకీలాద్రిపై దివ్యాంగ భ‌క్తుడిపై పాశవికంగా దాడి (Video)

విజయవాడలోని (Vijayawada) ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. భక్తుల రక్షణ (Devotees Protection) కోసం ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది, అవుట్ పోలీస్ ఒక నిస్సహాయుడైన దివ్యాంగుడిపై ప్రతాపం చూపడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంద్రకీలాద్రిపై భిక్షాటన చేసుకుంటున్న ఒక దివ్యాంగుడిని (Disabled Man) అవుట్ పోస్ట్ పోలీసు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది దారుణంగా చితక్కొట్టారు. దివ్యాంగుడి ఒంటిపై వాత‌లు తేలిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

వివ‌రాల్లోకి వెళితే..
విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన బ్రహ్మం (Brahmam) అనే వ్యక్తి దివ్యాంగుడు. ఆయన ప్రస్తుతం అయ్యప్ప మాల ధరించి, తన జీవనోపాధి కోసం ఇంద్రకీలాద్రిపై భిక్షాటన చేసుకుంటున్నారు. భిక్షాటన చేస్తున్నాడన్న నెపంతో ఇంద్రకీలాద్రి ఔట్ పోస్టుకు చెందిన పోలీసు(Police), అక్కడి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది బ్రహ్మంపై విరుచుకుపడ్డారు. దివ్యాంగుడనే కనికరం లేకుండా, పైగా మాలధారణలో ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా కర్రలతో ఆయనను వాతలు తేలేలా కొట్టారు. పోలీసుల దెబ్బలకు తాళలేక ఆ దివ్యాంగుడు విలవిలలాడిపోయాడు. ఆయన శరీరంపై వాతలు తేలిన దృశ్యాలు చూస్తుంటే దాడి తీవ్రత అర్థమవుతోంది.

రక్షక భటులే దాడి చేయ‌డంపై బాధితుడు బ్రహ్మం న్యాయం కోసం విజయవాడ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తనపై అకారణంగా దాడి చేసిన ఔట్ పోస్ట్ పోలీసు, సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు.

భక్తుల ఆగ్రహం
పవిత్రమైన పుణ్యక్షేత్రంపై ఇలాంటి ఘటనలు జరగడం పట్ల భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రతను పర్యవేక్షించాల్సిన పోలీసులు, ఇలా ఒక దివ్యాంగుడిపై దాడి చేయడం ‘ఖాకీ’ శాఖకే అవమానకరమని పలువురు విమర్శిస్తున్నారు. గతంలోనూ ఇంద్రకీలాద్రిపై పార్కింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది భక్తులపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయని, ఉన్నతాధికారులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment