మెగా వారసురాలి ఫోటో రిలీజ్..

ఎట్టకేలకు ‘క్లిన్‌కార‌’ ఫేస్ రివీల్

Summarize with AI

మెగా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతుల కుమార్తె క్లిన్ కార (Klin Kaara) ఫోటోను(Photo) సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. క్లిన్ కార మూడో పుట్టినరోజుBirthday) సందర్భంగా కుటుంబ సభ్యులు నిర్వహించిన వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఉపాసన షేర్ చేయగా, అందులో క్లిన్ కార కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. చిన్నారి అమాయకపు (Innocent) చిరునవ్వు (Smile), క్యూట్ లుక్స్ (Cute Looks) చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

మెగా కుటుంబం ఇప్పటివరకు క్లిన్ కారను మీడియా, సోషల్ మీడియాకు దూరంగానే ఉంచింది. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు(Mega Fans) ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఆసుపత్రి వద్ద క్లిన్ కారను చూసేందుకు అభిమానులు చేసిన ప్రయత్నాలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులే అధికారికంగా ఆమె ఫోటోను షేర్ చేయడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం క్లిన్ కార బర్త్‌డే ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment