తండ్రి పేరు తీసేసిన విజయ్ కుమారుడు

తండ్రి పేరు తీసేసిన విజయ్ కుమారుడు

తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ (Vijay) వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు కోలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారాయి. విజయ్ కుమారుడు (Vijay Son) జాసన్ సంజయ్ (Jason Sanjay) త్వరలో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తన తాజా ప్రాజెక్ట్ క్రెడిట్స్‌లో, ఇంకా సోషల్ మీడియా హ్యాండిల్స్‌ లో ఆయన తన పేరును మార్చుకున్నారు.

సాధారణంగా జాసన్ తన పేరును ‘జాసన్ సంజయ్ విజయ్’ (Jason Sanjay Vijay) అని పిలిపించుకునేవారు. కానీ ఇప్పుడు తన పేరు నుంచి తండ్రి పేరును తొలగించి, తల్లి పేరును చేరుస్తూ ‘జాసన్ సంజయ్ సంగీత’ (Jason Sanjay Sangeetha)గా మార్చుకున్నట్లు సమాచారం. తన తండ్రి కంటే తల్లికే ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం విజయ్ అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది.

విజయ్, ఆయన భార్య సంగీత మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ మరొక నటితో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ, సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయయించింది. ఆ తర్వాత విజయ్ నటి త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. దీనితో తన తల్లి పడుతున్న వేదనను చూసి, ఆమెకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే జాసన్ సంజయ్ తన తండ్రి పేరును పక్కన పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment