తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu Chief Minister), తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ (C. Joseph Vijay) ధారాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 30న ధారాపురం అసెంబ్లీ ఉపఎన్నికలో TVK అభ్యర్థి పి. సత్యభామకు (P. Sathyabhama) మద్దతుగా నిర్వహించిన సభలో మాట్లాడిన విజయ్.. తమ పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకేనని, రాజరికం లేదా కుటుంబ పాలన కొనసాగించాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ మర్చిపోమని అన్నారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ బాధ్యత అని విజయ్(Vijay) పేర్కొన్నారు. అవినీతి(Corruption), లంచాలకు (Bribes) తావులేని పాలన అందించడంపై దృష్టి పెట్టామని తెలిపారు. పాఠశాలలు, ప్రార్థనా స్థలాల సమీపంలోని 717 TASMAC మద్యం దుకాణాలను మూసివేసినట్లు, మహిళల భద్రత కోసం ‘సింగపెన్’ (Singapen) టాస్క్ఫోర్స్ కింద 2,546 కొత్త పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు 37 జిల్లాలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లలో 65 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.
ధారాపురం ఉపఎన్నికలో పి. సత్యభామకు (P. Sathyabhama) మద్దతుగా విజయ్ ప్రచారం కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 6న పోలింగ్, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో.. ప్రచార సభలో TVK రాజకీయ లక్ష్యాలు, ప్రజల పట్ల తమ బాధ్యతను ఆయన వివరించారు. రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రైతుల నుంచి కొనుగోలు చేసే పాల ధరను లీటరుకు రూ.6 పెంచామని కూడా విజయ్ వెల్లడించారు.








