విజయ్ ‘జననాయగన్’కు మరో బిగ్ షాక్

విజయ్ ‘జననాయగన్’ కు మరో షాక్

Summarize with AI

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన భారీ చిత్రం ‘జననాయగన్’ (Jananayagan)కు మరోసారి కోర్టు నుంచి ఊహించని షాక్ తగిలింది. సినిమా సెన్సార్ (Censor) అంశంపై కీలక పరిణామం చోటుచేసుకోవడంతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

జస్టిస్ పి.టి. ఆశా జనవరి 9న చిత్రానికి U/A 16+ సర్టిఫికెట్ జారీ చేయాలని CBFCను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై మద్రాస్ హైకోర్టు (Madras High Court) చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈరోజు ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ‘జననాయగన్’ విడుదలపై మరోసారి అనిశ్చితి నెలకొంది.

సింగిల్ బెంచ్ (Single Bench) ఇచ్చిన U/A సర్టిఫికెట్ జారీ ఆదేశాలను చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేస్తూ, ఈ వ్యవహారాన్ని మళ్లీ అదే స్థాయిలో పునర్విచారణ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే U/A సర్టిఫికెట్ ఇచ్చి, అనంతరం దాన్ని వెనక్కి తీసుకోవడంపై మేకర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

అప్పట్లో సింగిల్ బెంచ్ నిర్మాతలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, తాజాగా ఆ తీర్పును రద్దు చేయడంతో సెన్సార్ వివాదం మళ్లీ మొదటికి చేరింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు సినిమా విడుదలపై స్పష్టత లేకపోగా, ఫిబ్రవరిలో ‘జననాయగన్’ విడుదల దాదాపు అసాధ్యమేనన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment