ఎయిమ్స్ నుంచి ఉప రాష్ట్రపతి డిశ్చార్జ్

ఎయిమ్స్ నుంచి ఉప రాష్ట్రపతి డిశ్చార్జ్

Summarize with AI

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖ‌డ్‌ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయ‌న్ను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి తరలించారు. అక్కడ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ నేతృత్వంలో మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఉప‌రాష్ట్ర‌ప‌తిని డిశ్చార్జ్ చేశారు.

ధన్‌ఖ‌డ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఎయిమ్స్ వైద్యుల సూచన ప్రకారం, ఉప రాష్ట్రపతి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment