ఏపీలో(AP) మెగా డీఎస్సీ నియామకాల్లో(Mega DSC Recruitments) అక్రమాలపై(Irregularities) ప్రతిపక్ష వైసీపీ(YSRCP) ఆధారాలతో సహా బయటపెడుతోంది. జీవోల(GOs) మార్పిడితో జరిగిన కుట్రపూరిత స్కామ్‌గా(Conspiracy Scam), ఉద్యోగాలు అమ్ముకున్నారని(Jobs Sold) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ప్రెస్మీట్లో ఆధారాలను బయటపెట్టారు. దీంతో డీఎస్సీ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేశారు. దీనికి వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు.
కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఫోల్డబుల్ ‘డుయో’(iPhone Foldable ‘Duo’) ఫోన్ లాంచింగ్ వీడియో ట్రెండ్‌ను ఉపయోగిస్తూ జగన్ తన కౌంటర్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మెగా డీఎస్సీ నియామకాలపై జగన్ మరోసారి తన వాదనలను పునరుద్ఘాటించారు. కొందరికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే టీచర్ ఉద్యోగాలు (Teacher Jobs) ఇచ్చారని స్పష్టం చేశారు. టీచర్ ఉద్యోగాల భర్తీలో అర్హతలు, పరీక్షలు, స్పోర్ట్స్ కోటా (Sports Quota) వంటి అంశాలపై తాను ప్రశ్నలు లేవనెత్తుతున్నానని, ఈ అంశాలపై సమాధానం చెప్పాల్సింది పోయి సమర్థించుకుంటున్నారని చెప్పారు. “మెగా DSC పెద్ద స్కామ్”(Mega DSC is a Big Scam) అంటూ జగన్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే దొంగ ఏడుపులు ఎందుకని లోకేశ్‌ను ఉద్దేశిస్తూ కౌంటర్ ఇచ్చారు.
రాజకీయ విమర్శలకు సాధారణ ప్రకటనలతో కాకుండా ట్రెండింగ్ వీడియో ఫార్మాట్‌ను ఉపయోగిస్తూ జగన్ కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కొత్త ఐఫోన్ ఫోల్డబుల్ డుయో ఫోన్ లాంచింగ్ వీడియోను పోలిన విధానంలో రూపొందించిన ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.








