విక్టరీ వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబో ఫిక్స్!

Venkatesh, Trivikram Srinivas, Tollywood Movie, Upcoming Telugu Films, Sankranthi Hit, Nuvvu Naaku Nachav, Malliswari, Telugu Cinema News

Summarize with AI

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌లైన‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam )సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత వెంకటేశ్ (Venkatesh )మరోసారి ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. మ‌రో చిత్రానికి సంబంధించిన క‌థ‌ను విక్ట‌రీ వెంక‌టేశ్ ఫైన‌ల్ చేశార‌ని టాలీవుడ్ కాంపౌండ్ నుంచి వార్త‌లు వెలువ‌డుతున్నాయి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ (Trivikram)ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్ హీరో సినిమా రూపొందుకోబోతోంద‌ని స‌మాచారం. వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమాకు లైన్ క్లియర్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే చాలాకాలంగా ఈ కాంబోపై బజ్ ఉన్నా, ఇప్పుడు అధికారిక ప్రకటనకు సమయం దగ్గర పడినట్లే కనిపిస్తోంది. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ మాట‌లు అందించిన‌ సంగతి తెలిసిందే. వెంక‌టేశ్ సినిమాకు ఈసారి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడ‌న్న వార్త‌పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని విక్ట‌రీ వెంక‌టేశ్ ఫ్యాన్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment