15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి చూపు.. ఇంగ్లాండ్‌కూ మొదలైన టెన్షన్!

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి చూపు.. ఇంగ్లాండ్‌కూ మొదలైన టెన్షన్!

భారత క్రికెట్‌లో (Indian Cricket) కొత్త సంచలనంగా మారిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పుడు ఇంగ్లాండ్ England) పర్యటనలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. భారత్-ఇంగ్లాండ్ (India-England) మధ్య ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (T20 Series) ఈ యువ ఓపెనర్ అంతర్జాతీయ (International Cricket) అరంగేట్రం చేస్తాడా అనే ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ వంటి స్టార్ పేసర్ల బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ భారీ షాట్లు ఆడిన వైభవ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో తొలి టీ20లో అతడికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ అభిమానుల నుంచి బలంగా వినిపిస్తోంది.

మరోవైపు వైభవ్‌ను అడ్డుకునేందుకు ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంది. స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) మాట్లాడుతూ, వైభవ్‌ను ఎదుర్కొనేందుకు తమ వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో(IPL) 230కి పైగా స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచిన వైభవ్, ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’తో పాటు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్'(Emerging Player of the Season) అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో డెబ్యూ చేసే అవకాశం దక్కితే, 15 ఏళ్ల వయసులో భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించి, సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉన్న చిరకాల రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment