యూపీలో రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ

యూపీలో రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ

Summarize with AI

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో మంగళవారం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పంభీపూర్ సమీపంలో సిగ్నల్ సమస్య కారణంగా ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి మరో గూడ్స్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గార్డ్ కోచ్ మరియు ఇంజిన్ పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతతో రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, డ్రైవర్ సహా ఇద్దరు రైల్వే అధికారులకు స్వల్ప గాయాలే అయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోకో పైల‌ట్ల‌ను స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment