విజిలెన్స్ (Vigilance) అధికారుల నిర్లక్ష్యం, టీడీపీ బోర్డు (TDP Board) పర్యవేక్షణలోపం, పక్షపాత ధోరణి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఖజానాకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని సీపీఎం (CPM) నేత కందారపు మురళీ (Kandharapu Murali) ఆరోపించారు. తిరుమలలో ప్రైవేట్ హోటళ్ల (Private Hotels) కేటాయింపుల విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని సీపీఎం నేత ఆధారాలు (Evidence) బయటపెట్టాడు. డిప్ (DIP) విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని, మళ్లీ ఆన్లైన్ విధానంలోనే హోటళ్ల కేటాయింపులు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుమలలో 5 బిగ్ క్యాంటీన్లు (Big Canteen), 5 జనతా క్యాంటీన్లకు (Janata Canteens) టెండర్లు పిలిచారని తెలిపారు. ప్రస్తుతం మాత్రం స్థానికులకు అవకాశం లేకుండా ప్రత్యేక నిబంధనలు పెట్టారని విమర్శించారు. పదేళ్ల అనుభవం ఉండాలనే షరతుతో చిన్న వ్యాపారులను పూర్తిగా పక్కనబెట్టారని అన్నారు. బిగ్ క్యాంటీన్లకు 31 మంది అర్హత సాధించగా, వారిలో 26 మందిని అనర్హులుగా నిర్ణయించారని చెప్పారు. అర్హులుగా గుర్తించిన 10 మందిలో కూడా సరైన అర్హతలు లేని వారు ఉన్నారని ఆరోపించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులకు ప్రాధాన్యం ఇస్తూ, స్థానికులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
నెలకు రూ.35–45 లక్షలు అద్దె చెల్లించాల్సిన 10 హోటళ్లు గత 8 నెలలుగా తెరవలేదని, రూపాయి కూడా అద్దె చెల్లించలేదని తెలిపారు. వెజిటేరియన్ హోటళ్లకు మాత్రమే అనుమతి అన్న నిబంధనలు పెట్టినా, నాన్వెజ్ దాబాలు నడిపిన వారిని ఎంపిక చేశారని ఆరోపించారు. సన్నిధానం బిగ్ క్యాంటీన్ నెలకు రూ.27 లక్షలు చెల్లించాల్సి ఉండగా, రూ.3.50 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. 201 చదరపు అడుగుల ఆక్రమణ, 16 చెట్లు నరికివేత, అనధికార నిర్మాణాలు జరిగాయని ఆరోపించారు.
కౌస్తుభం గెస్ట్ హౌస్ (Kaustubham Guest House) ఎలివేషన్ మార్చుతూ భారీ నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. టిటిడి ఇంజినీరింగ్ అధికారులు విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని, అయినా విజిలెన్స్, హెల్త్ విభాగాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
అక్రమాల నేపథ్యంలో ప్రతి నెల రూ.7 లక్షలు అదనంగా వసూలు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిపారు. టిటిడి నిబంధనలు ఉల్లంఘించి అధిక రేట్లు వసూలు చేస్తున్నారని, దీనిపై టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించాలని కోరారు.
శ్రీవారి మెట్టు వద్ద చిన్న వ్యాపారులు రెండేళ్లుగా పోరాటం చేస్తుంటే పట్టించుకోకపోవడం, బయట రాష్ట్రాల వ్యాపారులకు రెడ్ కార్పెట్ వేయడం దురదృష్టకరమని అన్నారు. ఒక్క సన్నిధానం హోటల్ వల్లే రూ.4 కోట్ల నష్టం వాటిల్లిందని, మిగిలిన హోటళ్ల కారణంగా సుమారు రూ.16 కోట్ల ఆదాయం టిటిడికి నష్టం జరిగిందని కందారపు మురళి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుమలలో క్యాంటీన్ల కేటాయింపులో పక్షపాత ధోరణి
— Telugu Feed (@Telugufeedsite) February 20, 2026
– ఆధారాలు బయటపెట్టిన సిపిఎం నేత కందారపు మురళి
ఆన్ లైన్ విధానంలో హోటల్స్ కేటాయించాలి
5 బిగ్ క్యాంటీన్ లు, 5 జనతా క్యాంటీన్లకు టెండర్లు పిలిచారు
గతంలో ఆన్ లైన్ విధానంలో హోటల్స్ కేటాయింపులు చేసేవారు
స్థానికులకు అర్హత లేకుండా… pic.twitter.com/tlSZMqFzlv







