‘టాక్సిక్’లో హద్దులు దాటిన రొమాన్స్..

‘టాక్సిక్’లో హద్దులు దాటిన రొమాన్స్..

Summarize with AI

బోల్డ్ రొమాన్స్(Bold Romance), స్టైలిష్ విజువల్స్‌తో (Stylish Visuals) ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒకరు. ఇప్పుడు అదే తరహా ప్రమోషన్ స్ట్రాటజీని దర్శకురాలు గీతు మోహన్‌దాస్ (Geetu Mohandas) కూడా అనుసరిస్తోందనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. యష్(Yash), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న‘టాక్సిక్’(Toxic) చిత్రం నుంచి విడుదలైన ‘తబాహి’ పాట (Tabahi Song) సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ‘కేజీఎఫ్-2’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యష్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఈ పాటలో చూపించిన రొమాంటిక్ కెమిస్ట్రీ (Romantic Chemistry) సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. గతంలో గీతు మోహన్‌దాస్‌కు పెద్ద కమర్షియల్ హిట్ లేకపోయినా, యష్ ఆమెకు అవకాశం ఇవ్వడంపై వచ్చిన సందేహాలకు ఇప్పుడు ‘టాక్సిక్’ ప్రమోషన్‌తో సమాధానం చెబుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగా తన ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ చిత్రాల్లో రొమాన్స్, ఎమోషన్, యాక్షన్‌ను కలిపి ప్రత్యేక శైలిని రూపొందించుకున్నాడు. అదే తరహాలో ‘టాక్సిక్’లో కూడా గీతు మోహన్‌దాస్ బోల్డ్ రొమాన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లు ‘తబాహి’ సాంగ్ (Tabahi Song) స్పష్టం చేస్తోంది. అయితే సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావాలంటే కేవలం గ్లామర్ లేదా రొమాన్స్ మాత్రమే కాదు, బలమైన కథ, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే కూడా కీలకమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆగస్టు 26న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment