అదుపుత‌ప్పి విమానం బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం

అదుపుత‌ప్పి విమానం బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం

Summarize with AI

కెనడాలో మరో భయానక విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం ల్యాండ్ అయిన వెంటనే అదుపు తప్పి బోల్తా పడింది. బలమైన గాలులు వీస్తుండటంతో ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఎదురై, చివరికి విమానం తలకిందులైంది.

ఈ ప్రమాదంలో 18 మంది గాయపడగా, వీరిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. మరో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడినవారిని తక్షణమే హెలికాప్టర్ అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో విమానంలో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ఈ విమానం మిన్నియాపోలిస్ నుండి టొరంటోకు వచ్చేది. పియర్సన్ ఎయిర్‌పోర్టు అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ ఘటనపై ధృవీకరణ లభించింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment