ఏపీలో మ‌హిళ‌ల‌కు నామినేష‌న్లు వేసే స్వేచ్ఛ క‌రువు

ఏపీలో మ‌హిళ‌ల‌కు నామినేష‌న్లు వేసే స్వేచ్ఛ క‌రువు

Summarize with AI

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నామినేషన్లు వేసే కనీస స్వేచ్ఛ కూడా లేకపోగా, ప్రతిపక్ష పార్టీల మహిళా అభ్యర్థులపై టీడీపీ మూక‌లు సాగిస్తున్న అరాచకాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా తిరుపతిలో జరిగిన దారుణ ఘటనే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదనేదానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుండటంతో ప్రజాస్వామ్య వాదులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి ఎమ్మార్పల్లి 12వ వార్డు, 15వ వార్డు పరిధిలోని స్వర్ణ ఆఫీస్ వద్ద నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన వైసీపీ మహిళా అభ్యర్థులు మవిత, పావనిలపై టీడీపీ రౌడీలు, గుండాలు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు.

నామినేషన్ వేయ‌డానికి వ‌చ్చిన ఒక మహిళా అభ్యర్థిపై టీడీపీ మూకలు నడిరోడ్డుపై దాడి చేసి దుస్తులు చింపివేస్తూ అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారు. అందరి ముందూ మహిళను అవమానిస్తూ.. అభ్యర్థులపై పిడుగు గుద్దులు గుద్దుతూ, కిరాతకంగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయింది.

సంఘటన స్థలంలోనే పోలీసులు ఉన్నప్పటికీ, టీడీపీ మూకల ఈ దుర్మార్గాన్ని ఆపాల్సింది పోయి.. చూస్తూ నవ్వుకుంటూ మద్దతుగా వ్యవహరించారంటూ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లినా పోలీసు అధికారులు కనీసం పట్టించుకోకపోవడం ప్రభుత్వ కుట్రలకు అద్దం పడుతోంది.

నామినేషన్లు వేయడానికి వెళ్లే మహిళలపై ఈ స్థాయి భయానక దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నాయని ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు మండిపడుతున్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత పూర్తిగా కొరవడిందని, ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ రాక్షస రాజకీయాలను తిప్పికొడతామని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment