టీవీ5 ఛానెల్ (TV5 Channel)ను అడ్డం పెట్టుకొని మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీటీడీ చైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు (BR Naidu) తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని వైసీపీ(YSRCP) తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy).. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “వైఎస్ జగన్ అన్యమతస్థుడు, డిక్లరేషన్‌పై సంతకం చేయాలి, హిందువులు అసహ్యించుకుంటున్నారు” అనేలా బీఆర్‌నాయుడు ప్రచారం చేయించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. హిందూ ధర్మ పరిరక్షణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఎన్నో పుణ్యకార్యాలు జరిగినట్లు భూమన వివరించారు. ముఖ్యంగా శ్రీనివాస దివ్యహోమం కూడా వైఎస్ జగన్ పాలనలోనే ప్రారంభమైందని గుర్తుచేశారు. చంద్రబాబుతో పోలిస్తే, జగన్ హిందూ ధర్మానికి కొన్ని వేల రెట్లు ఎక్కువ సేవలు చేశారని కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దేవుడి స్థలాన్ని టూరిజం శాఖకు..
అలాగే, టిటిడి స్థలం టూరిజం శాఖకు బదిలీ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టిటిడి స్థలం పవిత్రమైనదని, అటువంటి ప్రదేశాలను వాణిజ్యపరంగా ఉపయోగించడం ఘోరమైన తప్పు అని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ దగ్గర టూరిజం శాఖకు 25 ఎకరాలు ఇవ్వవచ్చని, కానీ దేవుడి స్థలాన్ని ఇవ్వడం తప్పని స్పష్టం చేశారు. ఓబెరాయ్ హోటల్‌కి అనుమతులు ఇచ్చి మటన్ స్టాల్స్, తందూరీ కబాబ్స్ అందించే పరిస్థితి తలెత్తడం సిగ్గుచేటు అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంలో అధికారులు ఇచ్చే ప్రకటన కాదని, ఇది పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో బీఆర్ నాయుడు చేయించిన ప్రకటన అని ఆరోపించారు. రెండు సార్లు టిటిడి చైర్మన్‌గా, మూడుసార్లు బోర్డు సభ్యుడిగా పనిచేసిన తనకైతే ఈ నిర్ణయం పూర్తిగా తప్పు అని అర్థమవుతోందని తెలిపారు. “ఉత్తర వైపు పవిత్రమైన స్థలాన్ని బదలాయించి, దక్షిణ వైపు స్థలం ఇచ్చామని చెప్పడం తప్పుదారి పట్టించడం. పవిత్రమైనది కాదా అని బీఆర్ నాయుడు సమాధానం చెప్పాలి” అని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.







