బీఆర్ నాయుడు స్త్రీలోలుడు.. ఇందు’లేఖే’ చెబుతోంది

బీఆర్ నాయుడు స్త్రీలోలుడు.. ఇందు'లేఖే' చెబుతోంది

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (Tirumala Tirupati Devasthanam) చైర్మ‌న్‌గా కొన‌సాగే అర్హ‌త బీఆర్ నాయుడుకు (B.R. Naidu) లేద‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. బీఆర్ నాయుడుతో స‌న్నిహితంగా ఉన్న మ‌హిళ 2019లోనే సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ సీఎం చంద్ర‌బాబు (Nara Chandrababu Naidu), నారా లోకేష్‌ (Nara Lokesh), ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan)ల‌కు లేఖ రాసింద‌ని, ఆ లేఖ‌ను(Letter) భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో బ‌హిర్గ‌తం చేశారు. భ‌ర్త చ‌నిపోయిన ఓ బ్ర‌హ్మ‌ణ స్త్రీని బీఆర్ నాయుడు తీవ్ర మ‌నో వేధ‌న‌కు గురిచేశార‌ని, ఆ లేఖ‌లో ఆమె బ‌య‌ట‌పెట్టింద‌ని చెప్పారు.

బీ.ఆర్. నాయుడుపై భూమ‌న సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వీడియోలు ఏఐ టెక్నాలజీతో రూపొందించినవి కాదని నిపుణుల నివేదిక వచ్చిందని, ఆ అంశంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ఇందులేఖ‌ (Tadepalli Indulekha) రాసిన లేఖను మీడియా ముందు భూమన బయటపెట్టారు. ఆ లేఖలో 25 ఏళ్లుగా పరిచయం ఉందని, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉన్నాయని స‌ద‌రు బ్రాహ్మ‌ణ మ‌హిళ పేర్కొన్నట్లు భూమ‌న‌ తెలిపారు. త‌న‌ను ఇష్టారీతిగా దుర్భాలాడేవాడ‌ని, బీఆర్ నాయుడు లాంటి దుర్మార్గుడికి టీటీడీ ప‌ద‌వి ఇస్తే మ‌హిళ‌కు ర‌క్ష‌ణ ఉండ‌ద‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌ను ఆ లేఖ‌లో ఇందులేఖ పేర్కొన్నార‌ని చెప్పారు.

బీ.ఆర్. నాయుడు ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేసిన భూమన, అత్యున్నత ఆధ్యాత్మిక సంస్థకు నాయకత్వం వహించే వ్యక్తి నైతిక ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇటువంటి వివాదాలు కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ(TDP) అధికారంలోకి వస్తే రాజ్యసభ ఎంపీ, టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని ప్రచారం చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు.

భూమన మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ పదవికి బి.ఆర్. నాయుడు తక్షణమే రాజీనామా (Resignation) చేయాలని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ముఖ్యమని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బీఆర్ నాయుడును తాను క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నించాన‌న్న మాట అబ‌ద్ధ‌మ‌మ‌ని కొట్టిపారేశారు. అస‌లు బీఆర్ నాయుడు అనే వ్య‌క్తిని తాను మ‌నిషిగా కూడా చూడ‌న‌ని సెటైర్లు వేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment