తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లు ప‌డుతుందంటే..

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లు ప‌డుతుందంటే..

Summarize with AI

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు తెలిపారు.

కాగా, బుధవారం స్వామివారిని 70,457 మంది భక్తులు ద‌ర్శించుకున్నార‌ని, 22,152 మంది తలనీలాలు సమర్పించార‌ని టీడీపీ పేర్కొంది. హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీడీపీ తెలిపింది. భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతుండడంతో, టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను మరింత మెరుగుపరుస్తున్నారు. శ్రీవారి కృప కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment