రాజ‌ధాని క‌ట్టుకునే చేత‌కాదు, తెలంగాణలో విస్త‌రిస్తారా?.. – కవిత (Video)

రాజ‌ధాని క‌ట్టుకునే చేత‌కాదు, తెలంగాణలో విస్త‌రిస్తారా?.. - కవిత ఘాటు వ్యాఖ్యలు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh పాలకులపై, ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో విస్తరిస్తామంటూ ప్రకటనలు చేస్తున్న ఏపీ నేతలకు ఆమె గట్టి కౌంట‌ర్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు (Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో (Pawan Kalyan) పాటు తెలంగాణ ముఖ్యమంత్రిని (Telangana Chief Minister) లక్ష్యంగా చేసుకుని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

13 ఏళ్లయినా రాజధాని లేదు.. ఇక్కడ విస్తరిస్తారా?
రాష్ట్రం విడిపోయి 13 ఏళ్లు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఒక సొంత రాజధానిని (Capital City) కూడా నిర్మించుకోలేని స్థితిలో ఏపీ నేతలు ఉన్నారని కవిత ఎద్దేవా చేశారు. “తెలంగాణలో తమ పార్టీని విస్తరిస్తామని లోకేష్(Nara Lokesh) అంటున్నారు.. తెలంగాణ (Telangana) ఏమీ మీ సామ్రాజ్యం కాదు ఇక్కడ విస్తరించడానికి” అంటూ నారా లోకేష్ వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. అలాగే తెలంగాణలో ‘నవనిర్మాణం’ పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ పెడతారట అని ప్రస్తావిస్తూ.. ఇక్కడ సభలు పెట్టే ముందు, రాబోయే వర్షాకాలంలో ఏపీ సచివాలయంలోకి నీరు రాకుండా పవన్ కళ్యాణ్, లోకేష్ చూసుకోవాలని హితవు పలికారు.

సీఎం ఏపీ ఏజెంట్.. ఆ విగ్రహాలన్నీ కూలగొడతాం
తెలంగాణ ముఖ్యమంత్రిపై కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీఎం ఏపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని, అందుకే తెలంగాణ గడ్డపై ఆంధ్రా వాళ్ల విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విగ్రహాలన్నింటినీ కూలగొడతామని ఆమె సంచలన ప్రకటన చేశారు. “ఏపీ నేతలు వచ్చి మా సచివాలయంలో గరిటె తిప్పుతామంటే ఇక్కడ కుదరదు” అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

హైదరాబాద్‌లోని ఆంధ్రా ప్రజలు మా వారే
ఏపీ నేతల రాజకీయాలపై విరుచుకుపడిన కవిత.. ఇక్కడ నివసిస్తున్న ఆంధ్రా ప్రజలపై మాత్రం తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చని, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలంతా మా వారేనని కవిత పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రజలను తాము కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని, ఇకపై కూడా వారిని అంతే జాగ్రత్తగా కాపాడుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ నేతలు ఇక్కడికి వచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని కవిత స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment