తెలంగాణలో పప్పుధాన్యాల సాగు 36% పెరుగుదల: మంత్రి తుమ్మల

తెలంగాణలో పప్పుధాన్యాల సాగు 36% పెరుగుదల: మంత్రి తుమ్మల

Summarize with AI

పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు గత ఏడాదితో పోలిస్తే 36 శాతం పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ రబీ సదస్సులో ఆయన తెలంగాణ వ్యవసాయ రంగ ప్రగతిని వివరించారు. పప్పుధాన్యాల సాగులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని ప్రస్తుత స్థాయి నుంచి లక్ష ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న మండలాలకు ప్రత్యేక కేంద్ర సాయం, మొక్కజొన్న–జొన్నలను ధరల మద్దతు పథకం పరిధిలోకి తీసుకురావాలని మంత్రి కోరారు. ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయగా, ధరల సమస్యపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ హామీ ఇచ్చారు. అలాగే శాటిలైట్ ఆధారిత సాయిల్ హెల్త్ టెక్నాలజీ, అదనపు కృషి విజ్ఞాన కేంద్రాలు, కొడంగల్ అగ్రి బిజినెస్ పార్క్, సెమీ-అరిడ్ హార్టికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు కేంద్ర సహకారం అందించాలని తుమ్మల కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment