టెక్కలిలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

టెక్కలిలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Summarize with AI

శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు విద్యార్థులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. టెక్కలి బర్మాకాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నౌపడ నుంచి టెక్కలి వైపు రైలు వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లే క్రమంలో విద్యార్థులు రైల్వే ట్రాక్‌పైకి వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని స్థానికులు, అధికారులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. విద్యార్థులు రైల్వే ట్రాక్‌పైకి ఎందుకు వెళ్లారు? ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగింది? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment