రోడ్డు ప్ర‌మాదం.. కొడుకును త‌ప్పించిన టీడీపీ ఎమ్మెల్యే!

రోడ్డు ప్ర‌మాదం.. కొడుకును త‌ప్పించిన టీడీపీ ఎమ్మెల్యే!

Summarize with AI

శ్రీ‌కాకుళం జిల్లాలో ఏడాది క్రితం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కీల‌క‌ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. సాయం కోసం సంవ‌త్స‌ర కాలంగా ఎదురుచూస్తున్న బాధితులకు ఎలాంటి న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో సంచ‌ల‌న వీడియోలు బ‌య‌టపెట్టారు. శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే కొడుకు సాయి గణేష్‌ను తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్‌గా చూపించారని బాధితులు సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు.

బాధితుల వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్ ర్యాష్‌గా కారు నడుపుతూ ఆటోను బ‌లంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో చేపల భోగయ్య మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం కేసు విషయంలో ఎమ్మెల్యే కొడుకు సాయి గణేష్‌ను తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్‌గా చూపించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన భోగయ్య కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చర్చలు జరిపినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఉద్యోగం, పెన్షన్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగి ఏడాది గడిచినా ఇప్పటివరకు హామీ ఇచ్చిన రూ.5 లక్షలు అందలేదని, ఉద్యోగం, పెన్షన్ కూడా కల్పించలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధితులతో జరిగిన చర్చల సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చేసినట్లు చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు కూడా వీడియోలో వెలుగులోకి వచ్చాయి. హైకోర్టు అడ్వకేట్ జనరల్ తనకు తెలుసంటూ ఆయన బాధితులతో చెప్పినట్లు వీడియోలో ఉంది.

“ఆయనకు చెప్పానంటే అసలు కేసే లేకుండా చేస్తాడు”, “రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు”, “తెల్లవారుజామున 6 గంటలకే ఇక్కడికి వచ్చేస్తాడు” అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు బాధితులు పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్‌తో తనకున్న పరిచయాన్ని ప్రస్తావిస్తూ తమపై ఒత్తిడి తెచ్చేలా మాట్లాడారని వారు ఆరోపిస్తున్నారు. అయితే అప్పట్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రస్తుతం తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు న్యాయం చేయాలని, హామీ ఇచ్చిన డబ్బులు చెల్లించడంతో పాటు ఉద్యోగం, పెన్షన్ కల్పించాలని మృతుడు భోగయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మామిడి గోవిందరావును కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. సాయి గణేష్‌ను ప్రమాదం నుంచి తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్‌గా చూపించారన్న ఆరోపణలు, బాధిత కుటుంబంతో జరిగిన చర్చలకు సంబంధించిన వీడియోలు తాజాగా వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. మ‌రి బాధితుల స్టేట్‌మెంట్ ఆధారంగా ఎమ్మెల్యేపై పోలీసులు కేసు న‌మోదు చేస్తారా..? సీఎం చంద్ర‌బాబు ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటారా..? అనే ప్ర‌ధాన ప్ర‌శ్న‌

Join WhatsApp

Join Now

Leave a Comment