కేసు ఏదైనా వారికి స్టేష‌న్ బెయిల్ ఎలా..?

కేసు ఏదైనా వారికి స్టేష‌న్ బెయిల్ ఎలా..?

Summarize with AI

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే ఒక్క అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సామాన్యులకు(Common People) ఒక న్యాయం(Justice), అధికారంలో ఉన్న ప్రముఖుల కుటుంబాలకు (Families of Political Influentials) మరో న్యాయం (Different Justice) అన్నట్లుగా వ్యవహారాలు సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్కా ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు (Direct Witnesses) ఉన్నప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులు చట్టం నుంచి సులువుగా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని ఎందుకు అరెస్ట్ చేయ‌డం లేద‌న్న ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. బాధితులు న్యాయం కోసం నిరీక్షిస్తుంటే, నిందితులు మాత్రం దర్జాగా తిరుగుతున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఐదురోజులు ఎందుకు దాచిపెట్టారు
హైదరాబాద్‌లో(Hyderabad) జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో(Road Accident) ఏపీ సీఎం చంద్ర‌బాబుకు(Nara Chandrababu Naidu) అత్యంత స‌న్నిహితుడు, జనసేన (Jana Sena)ఎంపీ లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) కుమారుడు సంజూష్‌(Sanjoosh) వ్యవహారం తాజాగా రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. రూ. 4.63 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారుతో(Aston Martin Car) ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ యువతి మృతికి కారణమయ్యాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రమాదం గురించి ఐదు రోజుల తరువాత జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుగు ప్రజలు తెలుసుకోవడం శోచనీయం.

ప్రమాదం అనంతరం లింగ‌మ‌నేని కొడుకు త‌ప్పించుకునేందుకు య‌త్నించ‌గా, స్థానికులు అడ్డుకొని అదే కారులో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రికి చేరిన అనంత‌రం సంజూష్ అక్క‌డి నుంచి ప‌రారైన‌ట్టు స‌మాచారం. కారు పోలీసుల స్వాధీనంలో ఉండటం, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ఉన్నా.. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని వెంటనే ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఐదు రోజుల తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి రావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పోలీసులు సూచించినా.. ఎందుకు హాజరు కాలేదన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది.

రాజకీయ పలుకుబడే కారణమా?
లింగమనేని రమేష్‌.. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత స‌న్నిహితుడు. ఏపీలో చంద్రబాబు 12 ఏళ్లుగా నివాసం ఉన్న కరకట్ట భ‌వ‌నం (Karakaṭṭa Residence) లింగమనేని ర‌మేష్‌దే కావ‌డం గ‌మ‌నార్హం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న రాజకీయ సంబంధాలను ఈ కేసుతో ముడిపెట్టి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు-రేవంత్‌రెడ్డికి (Chandrababu-Revanth Reddy) ఉన్న హాట్‌లైన్ బంధం కార‌ణంగానే లింగ‌మ‌నేని కొడుకు యువ‌తిని చంపేసినా అరెస్ట్ కాకుండా ద‌ర్జాగా బ‌య‌ట తిరుగుతున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

పుట్టా మహేష్‌ కేసులోనూ..
ఇదే సమయంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్(Putta Mahesh) రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. పోలీసులు నిర్వహించిన పరీక్షల్లో ఆయన డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని పోలీస్ అధికారి సైతం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అరెస్టు కావాల్సిన టీడీపీ ఎంపీకి ఈ కేసులో 24 గంట‌ల్లో స్టేష‌న్ బెయిల్ మంజూరైంది.

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు (Putta Mahesh) నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు.. ఈ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డిని, రితేష్ రెడ్డి, నితిన్ శ‌ర్మ‌ల‌ను ఉప్ప‌ర‌ప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచి కోర్టు ఆదేశాల‌తో రిమాండ్‌కు త‌ర‌లించారు. కానీ, రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన టీడీపీ ఎంపీ స్టేష‌న్ బెయిల్‌ ఎలా సాధ్యం అనే అనుమానాలు అప్ప‌ట్లో క‌లిగాయి. దీనికి కూడా చంద్ర‌బాబు-రేవంత్ హాట్ లైన్ బంధం ద్వారానే టీడీపీ ఎంపీ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని గ‌తంలో రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు చ‌ర్చించుకున్న విష‌యం తెలిసిందే.

కొడుకును త‌ప్పించిన టీడీపీ ఎమ్మెల్యే
అదే విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవింద‌రావు కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆటోను ఢీకొట్టిన ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి భోగయ్య మృతిచెందాడు. వెంట‌నే ఈ కేసు నుంచి ఎమ్మెల్యే కొడుకు సాయిగ‌ణేష్‌ను త‌ప్పించి, మ‌రో వ్య‌క్తిని డ్రైవ‌ర్‌గా చూపించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెప్పొద్ద‌ని, రూ.5 ల‌క్ష‌ల న‌గ‌దు, ఉద్యోగం, పెన్షన్ ఇప్పిస్తాన‌ని ఆ కుటుంబంతో డీల్ కుదుర్చుకొని మోసం చేయ‌డంతో ఏడాది త‌రువాత మృతుడు భోగ‌య్య కుటుంబం మీడియా ముందుకు వ‌చ్చి ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ విష‌యం తెలిసిందే.

‘టీడీపీలో 96 శాతం క్రిమినల్‌ కేసులు’
టీడీపీ ప్రజాప్రతినిధుల్లో పెద్ద సంఖ్యలో క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) నివేదిక బ‌య‌ట‌పెట్టింది. దేశంలో కల్లా అన్ని రాజ‌కీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీలోనే 96 శాతం క్రిమిన‌ల్ కేసులున్న నాయ‌కులు ఉన్నార‌ని ఇటీవ‌ల కేంద్ర అనుబంధ సంస్థ అయిన ఏడీఆర్ ప్ర‌క‌టించింది. తాను నిఖార్స‌యిన పొలిటీషియ‌న్ అని చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు.. దేశంలో క్రిమిన‌ల్ కేసులు(19)న్న ముఖ్య‌మంత్రుల జాబితాలో నాల్గ‌వ స్థానంలో నిల‌వ‌డం కొస‌మెరుపు.

సామాన్య పౌరుడైతే ఇలా ఉంటుందా..?
లింగ‌మ‌నేని కొడుకు విష‌యంలోనైనా, టీడీపీ ఎంపీ పుట్టా డ్ర‌గ్స్ పార్టీ వ్య‌వ‌హారంలో అయినా, శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే కొడుకు ప్ర‌మాదంలోనైనా ఒక‌ సాధారణ పౌరుడు నిందితుడిగా ఉంటే త‌ప్పించుకోవ‌డం సుల‌భ‌మేనా..? అనే ప్ర‌శ్నిస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు చేసిన నేరాల‌ విషయంలో కనిపించే వైఖరిలో తేడా ఉండకూడదని న్యాయ‌నిపుణులు, రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు.

నేరం చేసిన వ్య‌క్తిని రాజ‌కీయ, ఆర్థిక అండ‌దండ‌ల‌తో కేసుల నుంచి త‌ప్పించ‌డం, తేలిక‌పాటి చ‌ర్య‌ల‌కే ప‌రిమిత‌మైతే.. స‌మాజంలో ఒక చెడు సంప్ర‌దాయానికి ఆజ్యం పోసిన‌ట్టు అవుతుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్రాణాలు తీసినా, మాద‌క ద్ర‌వ్యాల‌తో దొరికిపోయినా.. త‌మ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌న్న విచ్చ‌ల‌విడి త‌నం పెరిగిపోతుందని అంటున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది. జ‌న‌సేన పార్టీ ఎంపీ లింగ‌మ‌నేని కొడుకు రోడ్డు ప్ర‌మాదం వ్య‌వ‌హారంలో చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల‌న్న డిమాండ్లు వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment