తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నాగేంద్రన్.. బ్యాగ్రౌండ్‌ ఇదే

తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నాగేంద్రన్.. బ్యాగ్రౌండ్‌ ఇదే

Summarize with AI

తమిళనాడు (Tamil Nadu) బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కీలక మార్పులు తలెత్తాయి. అధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్న ఇటీవల రాజీనామా చేయడంతో, ఆయన వారసుడిగా నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) పేరును అధిష్టానం ప్ర‌క‌టించింది. బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నాగేంద్ర‌న్ పేరు అధికారికంగా (Officially) ప్ర‌క‌టించారు. అన్నామలై (Annamalai) చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ సీఎం జయలలిత (Jayalalitha)పై, అన్నాడీఎంకే (AIADMK) తో బీజేపీకి దూరం తీసుకొచ్చాయి. కానీ, వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమిని పునరుద్ధరించేందుకు బీజేపీ యత్నిస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకేతో అనుబంధం ఉన్న నాగేంద్రన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP-State President) గా ప్రకటిస్తే ప్రయోజనం చేకూరుతుందని కాషాయ నాయ‌క‌త్వం భావిస్తోంది.

నాగేంద్రన్ రాజకీయ ప్రయాణం
జయలలిత మరణం తర్వాత 2016లో అన్నాడీఎంకేను విడిచి బీజేపీలో చేరిన నాగేంద్రన్, 2021లో తిరునల్వేలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ శాసనసభ పక్షనేత (Legislative Party Leader) గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన అన్నాడీఎంకేలో కీలక నాయకుడిగా పని చేసిన అనుభవం కూడా ఉంది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఉండాలి. మూడు సంస్థాగత ఎన్నికల్లో పాల్గొనాలి. రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సభ్యుల ద్వారా నామినేట్ చేయబడాలి. ఈ ప్రమాణాలను నాగేంద్రన్ పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, తమిళిసై సౌందరరాజన్ పేరు కూడా చర్చలో ఉన్నప్పటికీ, హైకమాండ్ మాత్రం నాగేంద్రన్ వైపే మొగ్గు చూపింద‌ని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకొని అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను నాగేంద్ర‌న్‌కు అప్ప‌గించిన‌ట్లుగా చ‌ర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment